రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడివి అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది. గతంలో రాహుల్ చైనా సైన్యం 2,000 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించిందని, 20 మంది భారత సైనికులను చంపిందని, అరుణాచల్ ప్రదేశ్లో జవాన్లపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశాన్ని కించ పరిచేలా ఉన్నాయని అన్నీ అసత్య ఆరోపణలేనని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సైన్యాన్ని నిరుత్సాహపరిచేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్పై ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను అలహాబాద్ హైకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. అలహాబాద్ హైకోర్టు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దాంతో సుప్రీంను ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణలో జస్టిస్ దీపాంకర్ దత్తా, ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం, రాహుల్ గాంధీ మాటల ఎంపిక మ, ప్రజా వేదికను ఉపయోగించిన తీరును తప్పుపట్టింది. జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలను పార్లమెంటులో చర్చించాలని, మీడియా లేదా సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. నిజమైన భారతీయులు ఇలా చేయరని స్పష్టం చేసింది.
అయితే ఈ అంశంలో రాహుల్ గాందీపై తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.