గంగిరెడ్డి బెయిల్ రద్దుకు షరతులా ? సుప్రీంకోర్టు ఆశ్చర్యం

ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు విష‌యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు సీజే జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. బెయిల్ ని ర‌ద్దు చేసి..మ‌ళ్లీ ఫ‌లాన రోజున బెయిల్ ఇవ్వాలంటు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు మళ్లీ జూలై1వ తేదీన మళ్లీ బెయిల్ ఇచ్చినట్లేనని ఆ రోజున విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సునీత పిటిషన్ ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడుగా ఉన్నాడు ఎర్ర గంగి రెడ్డి. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది. గతంలో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ సీబీఐకి పెట్టిన షరతులపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని, సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డికి ఆదేశాలిచ్చింది. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీ లోపు ముగించాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డిని రిమాండ్ కు తరలించాలని సీబీఐ అధికారులకు స్పష్టం చేసింది. జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి నిర్ణయం తీసుకోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close