ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది.

ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని, వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లకు అందించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అలాగే, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ పిటిషన్ దాఖలు చేసింది. వీటన్నింటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ఏకాభిప్రాయంతో తీర్పునిచ్చింది. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేశారు.

ఈవీఎం-వీవీప్యాట్లకు సంబంధించి రెండు సూచనలు చేసింది సుప్రీంకోర్టు. సింబల్‌ లోడ్‌ తర్వాత ఎస్‌ఎల్‌యూలు సీల్‌ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దాని 45రోజులు భద్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంల పరిశీలనకు అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇంజినీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కల్పించాలని…ఈవీఎంల పరిశీలనకు అభ్యర్థుల నుంచి 7 రోజుల్లో వినతి వస్తే పరిగణించాలని స్పష్టం చేసింది.

ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యర్థులే భరించాలని…ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అని తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలన్నారు. కాగా, వీవీ ప్యాట్ పేపర్ స్లిప్ లను మాన్యువల్ గా లెక్కించడం చాలా సమయంతో కూడినదని.. అంతేగాక మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉందని సీఈసీ వాదనలు వినిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు ఝలక్.. వాళ్లూ జారుకుంటున్నారు!

జగన్ తానొకటి తలిస్తే.. వైసీపీ నేతలు మరొకటి తలుస్తున్నారు. అధికారం పోతే పోయింది అయినా ఇంకా అప్పర్ హ్యాండ్ తమదే అన్న ధీమాతో జగన్ ఉంటే అది కూడా జరిగేలా కనిపించడం లేదు....

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close