నాలుగో ఎంపీ.. మొదటి కేంద్రమంత్రి..! బలి కోరుతున్న కరోనా..!

దేశంలో కరోనా ప్రభావం తగ్గిపోతోంది… రికవరీ రేటు పెరుగుతోందని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది కానీ.. అసలు నిజం మాత్రం కరోనా పంజా చాలా తీవ్రంగా ఉంది. కొద్ది రోజుల్లోనే నలుగురు ఎంపీలు చనిపోయారు. వారిలో ఓ కేంద్రమంత్రి కూడా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుకు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంత్ చనిపోగా.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముగ్గురు చనిపోయారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, కర్ణాటక రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ వారం వ్యవధిలో చనిపోగా. ..తాజాగా కర్ణాటకకే చెందిన కేంద్ర మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఆయన కరోనా సోకే వరకూ అధికార విధుల్లో చురుగ్గా ఉన్నారు. కానీ కరోనా బారిన పడి.. ఎయిమ్స్‌లో చేరిన పది రోజులకే కన్నుమూశారు.

అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే ఎంపీలే ఇలా.. వరుసగా కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఎంపీలతో పాటు వారి కుటుంబసభ్యులు.. వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా టెస్టులు చేశారు. అప్పుడే కొంత మందికి పాజిటివ్ వచ్చింది. అయితే… ఆ తర్వాత కూడా సభలో అనేక మందికి నిర్ధారణ అయింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కూడా సోకింది. దీంతో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అంచనా వేయలేకపోతున్నారు.

మరో వైపు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వాలు వీలు కల్పించాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నా.. అవి రాజకీయంగా… ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప.. అధికారికంగా ఎక్కడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో దేశంలో కోరనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రికవరీలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు కానీ.. నాలుగైదు రోజుల తర్వాత కరోనా రోగులను ఇంటికి పంపేసి.. క్యూర్ అయిపోయిందని రిపోర్టులు రాసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఎంపీలు కరోనా బారిన పడి మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో ప్రజల కోణం నుంచి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

జగన‌ చల్లని చూపు కోరుకుంటున్న సీపీఎం..!

ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల పయనం.. భిన్న కోణాల్లో సాగుతోంది. సీపీఐ యాంటీ జగన్ నినాదంతో దూసుకెళ్తుండగా.. సీపీఎం మాత్రం వైసీపీ నీడలో సేదదీరుతోంది. జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ ఎక్కడా కనీస...

ఏపీ అంటే జోకా ? పోలవరం ఆ నిధుల్లోనూ మళ్లీ కోత..!

దుబాయ్ శీను సినిమాలో ముంబైలో ఉండే పట్నాయక్ రవితేజ అండ్ గ్యాంగ్‌ని ఎలా బకరాని చేస్తారో చాలా సార్లు చూశాం. వారికివ్వాల్సిన డబ్బుల్ని ఎన్ని రకాలుగా కోత పెట్టి చివరికి మీరే బాకీ...

ఏపీలో ఫిబ్రవరిలో పెట్టుబడుల సదస్సు..!

సన్‌రైజ్ ఏపీ పేరుతో గత ప్రభుత్వం విశాఖలో ప్రతీ ఏటా పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించి ఎంవోయూలు చేసుకునేది. అలా చేసుకున్న ఎంవోయూలలో ఒక్కటి కూడా పెట్టుబడిగా...

HOT NEWS

[X] Close
[X] Close