బాల సినిమా నుండి తప్పుకున్న సూర్య.. కారణమిదే

దర్శకుడు బాల, సూర్య లది సూపర్ హిట్ కాంబినేషన్. ‘శివ పుత్రుడు’ లాంటి క్లాసిక్ వీరి కాంబోలో వచ్చింది. చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి ఇటీవల ‘వనన్‌గాన్‌’ (అచలుడు) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి సూర్య వైదొలిగినట్టు తాజాగా దర్శకుడు బాలా ప్రకటించారు.

”మా తమ్ముడు సూర్యతో ‘వనన్‌గాన్‌’ అనే సినిమాను డైరెక్ట్‌ చేయాలనుకున్నాను. అయితే కథలో కొన్ని మార్పుల వల్ల ఈ కథ సూర్యకి సూట్ అవుతుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. సూర్యకి నాపై, ఈ కథపై పూర్తి నమ్మకం ఉంది. అంత ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న తమ్ముడు సూర్యకి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండ చూడటం అన్నగా నా కర్తవ్యం. ఈ విషయంలో ఇద్దరం చర్చించుకున్నాం. ఈ సినిమా నుంచి సూర్య తప్పుకుంటాడని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. దీనికి చాలా బాధగా ఉన్నా, ఇది అతని శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయం.” అని చెప్పుకొచ్చారు బాల. అయితే ఈ సినిమాలో సూర్య లేకపోవచ్చు కానీ సినిమా మాత్రం ఉంటుందని వెల్లడించారు బాల.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

అదానీ యాపారం : కూలుతున్న సామ్రాజ్యం ఓ వైపు రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవో మరో వైపు !

గత వారం రోజులుగా దేశంలో అదానీ గ్రూపు కంపెనీలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఆ కంపెనీలన్నీ గాలి మేడలని అమెరికాకు చెందిన హిండెన్‌బెర్గ్ రీసెర్చ్ ప్రకటించిన తర్వాత...

హైకోర్టుకు చేరనున్న కేసీఆర్ వర్సెస్ గవర్నర్ పోరు !

తెలంగాణ గవర్నర్ ను గుర్తించడానికి కూడా ఇష్టపడని తెలంగాణ సీఎం కేసీఆర్ కు .. కొన్ని పరిస్థితుల్లో ఆమె సంతకాలు రాజ్యాంగ పరంగా తప్పని సరి అవుతున్నాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లలకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close