సస్పెన్షన్‌లో ఉన్న జగన్ సర్వీస్ అధికారి సునీల్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారు. కుల సమావేశాలు పెట్టి కాపులకు సీఎం పోస్టు.. దళితులకు డిప్యూటీ సీఎం పోస్టు అని పంపకాలు చేస్తున్నారు. హాఫ్ కోటు వేసుకుని ఆయన ఈ కుల రాజకీయాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎస్‌గా ఉంటూ అనధికారికంగా విదేశాలకు తిరిగి వచ్చారు సునీల్ కుమార్. ఏ కారణాలపై తిరిగి వచ్చారో అంతా సీక్రెట్ గా ఉంచారు. దీంతో సర్వీస్ రూల్స్ ఉల్లంఘనకింద సస్పెన్షన్ కు గురయ్యారు. వివరణ కూడా సరిగా ఇవ్వడం లేదు. కానీ ఈ ఖాళీ సమయాన్ని ఆయన కుల రాజకీయాలకు వినియోగించుకుంటున్నారు. కుల రహిత సమాజం అంటారు కానీ ఆయన చేసేవన్నీ కుల రాజకీయాలు. కాపులు, దళితులు కలిస్తే అధికారం వస్తుందని.. మీరు సీఎం తీసుకోండి.. మాకు డిప్యూటీ సీఎం ఇవ్వడని ఆయన … ఆ వర్గాలకు ప్రతినిధిగా ప్రకటించడం హైలెట్ అవుతోంది.
దళిత కోటా కింద ఐపీఎస్‌గా ఎన్నికయినా ఆయన.. పోలీస్ సర్వీస్ లో జగన్ లాంటి వారికి ఊడిగం చేసి.. తప్పుడు కేసులు, తప్పుడుపనులతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ మత సంస్థను నడుపుతున్నారు. దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో వీడియోలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రం చాలా సార్లు లేఖలు పంపింది. అయినా ఆయన తన కులాన్నే అడ్డం పెట్టుకుని ఏమన్నా అంటే వేధిస్తున్నారని ప్రచారం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు.
రేపు నాలుగో తేదీన రఘురామను కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే కుల రాజకీయాలు ప్రారంభించారు.