అడ‌విశేష్ హీరోనా..? విల‌నా..?

డిసెంబ‌రు 2న విడుదల అవుతున్న హిట్ 2 ప్ర‌మోష‌న్లు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి రాజ‌మౌళి రావ‌డంతో.. హిట్ 2కి మ‌రింత కిక్ వ‌చ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్ కూడా బాగా క‌ట్ చేశారు. ట్రైల‌ర్ లో విల‌న్ ఎవ‌రో క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ అదే. హంత‌కుడు ఎవ‌రో అన్వేషిస్తూ సాగే క‌థ ఇది. సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో ఓ కామ‌న్ పాయింట్ ఉంటుంది. హంతకుడు ఎవ‌రో తెలియ‌న‌ప్పుడు.. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రిపైనా అనుమానాలు రేకెత్తేలా సీన్లు డిజైన్ చేస్తుంటారు. ఆ త‌ర‌వాత అస‌లు హంత‌కుడు బ‌య‌ట‌కు వ‌స్తాడు. `హిట్ 2` ఫార్మెట్ కూడా అదే. ఓద‌శ‌లో.. అడ‌విశేష్ పైనా అనుమానాలు రేగుతాయ‌ని, త‌నే విల‌న్ అనుకొనే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని… అయితే అడ‌విశేష్ హీరోనా, విల‌నా? అనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ట్విస్ట్…. ఈ క‌థ‌కు ఆయువు పట్టు. అందుకే సినిమా చూసిన‌వాళ్లెవ‌రూ ఆ ట్విస్ట్ బ‌య‌ట‌కు రివీల్ చేయొద్దు.. అంటూ చిత్ర‌బృందం ప్రేక్ష‌కుల్ని కోరుతోంది. ఈ సినిమాలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. హిట్ 3 హీరోని ఈ సినిమా క్లైమాక్స్‌లో రివీల్ చేయ‌బోతున్నార్ట‌. అది కూడా ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచే ఎలిమెంటే.! హీరోని ఎలాగూ రివీల్ చేస్తారు కాబ‌ట్టి.. హిట్ 2 ఫ‌లితం ఎలా ఉన్నా… హిట్ 3 ప‌ట్టాలెక్క‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close