అపర కీచక్ ఈ “బీజేపీ స్వామి” చిన్మయానంద ..!

మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్…ఓ న్యాయవిద్యార్థినిని ఏడాది పాటు బంధించి అత్యాచారం చేసినట్లుగా… ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారం.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం..ఉత్తరప్రదేశ్‌లో ఓ లా విద్యార్థిని బీజేపీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేసింది. తనకు ప్రధాని, యూపీ సీఎంను న్యాయం చేయాలని కోరింది. అయితే ఆ వీడియోలు పెట్టిన తర్వాత ఆమె అదృశ్యమయింది.

ఈ వీడియోలు సంచలనం సృష్టించడం…. ఆ విద్యార్థిని కనిపించకుండా పోవడంతో… ఈ కేసును..సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఐజీ స్థాయి పోలీస్ అధికారిని ఇన్చార్జిగా పెట్టి ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. విచారించేందుకు ప్రత్యేక కోర్టు బెంచ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఆ లా విద్యార్థిని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమె దగ్గర్నుంచి వివరాలు సేకరించారు. ఆమె అనేక సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు ప్రకటించిన 12 పేజీల స్టేట్ మెంట్ ను బాధిత లా విద్యార్థి నుంచి రికార్డ్ చేశారు. ఆమె…ప్రత్యేక దర్యాప్తు బృందానికి పెన్ డ్రైవ్ ఇచ్చారు. అందులో చిన్మయానంద్‌కు ఆకృత్యాలకు సంబంధించి 42 వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్మయానందకు… అనేక విద్యాసంస్థలు ఉన్నాయి.వాటిలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన విద్యాసంస్థ హాస్టల్ లో పెట్టాడని.. బాత్రూంలో స్నానం చేస్తున్న తన వీడియో తీసి పలుమార్లు అత్యాచారం చేశాడని.. లా విద్యార్థిని ఆరోపిస్తోంది. గన్ మెన్ లతో బెదిరించి… సంవత్సరం నుంచి తనపై అత్యాచారం చేస్తూ వేధించాడని సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. తన కుటుంబం పేదరికం కావడంతో తాను ఈ ఆగడాలు భరించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి తెలిపింది. చిన్మయానందకు మద్దతుగా సంత్ సమాజ్ కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిలను రేప్ చేయించాడని.. తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించాడని లా విద్యార్థిని సిట్ ముందు నోరు విప్పింది.

రెండు రోజుల నుంచి సిట్ పోలీసులు 11 గంటలపాటు ఆమెను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు యువతి స్టేట్ మెంట్ ఆధారంగా చిన్మయానందపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్వామి చిన్మయానంద ఆశ్రమాన్ని సిట్ మూసివేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close