భాజపాలో చేరేలోగానే రాజగోపాల్ పై చర్యలకు సిద్ధం..!

ఈ నెల 6న భాజ‌పాలో చేరేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే ఆయ‌న సొంత పార్టీ కాంగ్రెస్ మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం నుంచి కూడా నోటీసులు అందుకున్నారు. అయితే, కోమ‌టిరెడ్డిపై చ‌ర్య‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం నుంచి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి స్పంద‌నా లేదు! మ‌రో రెండ్రోజుల్లో ఆయ‌న పార్టీ మార‌బోతున్న నేప‌థ్యంలో… భాజ‌పా కండువా క‌ప్పుకోక ముందే ఆయ‌న‌పై వేటు వేసేందుకు కాంగ్రెస్ హైక‌మాండ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి అనుకూలంగా రాజ‌గోపాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే ఒక నివేదిక పార్టీ హైక‌మాండ్ కి చేరింది. ఆ త‌రువాత‌, మ‌రో నివేదిక కూడా రాష్ట్ర క‌మిటీ నుంచి ఢిల్లీకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ తీరు ఇప్పుడే కాదు, ఇంత‌కు ముందు కూడా పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేదిగానే ఉందని దాన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీట్ల స‌ర్దుబాటు జ‌రుగుతున్న‌ప్పుడు రాష్ట్ర నాయ‌క‌త్వంపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియాపై… ఆయ‌నే పార్టీకి ప‌ట్టిన శ‌ని అన్న‌ట్టు వ్యాఖ్యానించారు. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను ఉద్దేశించి… సొంత నియోజ‌క వ‌ర్గంలో గెల‌వ‌లేనివారు, పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారానికి వెళ్ల‌డ‌మేంట‌ని చేసిన వ్యాఖ్య‌ల్ని కూడా ఇప్పుడు మ‌రోసారి హైక‌మాండ్ ముందున్న‌ నివేదిక‌లో ప్ర‌స్థావించార‌ని స‌మాచారం.

ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఏఐసీసీ, కోమ‌టిరెడ్డిపై వెంట‌నే వేటు వేయాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టుగా ఆ పార్టీ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. పార్టీ మార‌క‌ముందే వేటు వేస్తేనే శ్రేణుల‌కు మంచి సంకేతాలు వెళ్తాయ‌నేది అధినాయ‌క‌త్వం ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అయితే, మ‌రో రెండ్రోజుల్లో రాజ‌గోపాల్ పార్టీ మార్పున‌కు ముహూర్తం పెట్టుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు హుటాహుటిన చ‌ర్య‌లు తీసుకున్నా కాంగ్రెస్ కి పెద్ద‌గా క‌లిసొచ్చే అంశం అవుతుందా..? ఈ చ‌ర్య‌లేవో ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్పుడే తీసుకుని ఉంటే, ఏఐసీసీ చాలా సీరియ‌స్ గా ఉంద‌నే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోకి వెళ్లేది. పార్టీ నుంచి వేటుకు గురైన నేత‌గా కొన్నాళ్లైనా రాజ‌గోపాల్ మీద కొంత చ‌ర్చ జ‌రిగి ఉండేది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close