సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ప్రకటించిన ఉదయనిధి స్టాలిన్ కు చెందిన పార్డీ డీఎంకే కు చెందిన మంత్రి అంత కంటే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మాటల దెబ్బకు తమిళనాడు షేకైపోతోంది. దేశవ్యాప్తంగా హిందూత్వ వాదులు మండిపడుతున్నారు. డీఎంకే మహిళలు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఎంపీ కనిమొళి కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదంటున్నారు.
ఆ మంత్రి పేరు పొన్ముడి. ఓ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శైవం, వైష్ణవం నామాల ప్రస్తావన తెచ్చారు. ఓ వేశ్య దగ్గరకు విటుడు వెళ్తాడట. అప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందని.. అందులో ఓ రకమైన నామాలు ఉంటే.. ఓ రకమైన శృం** భంగిమ.. మరో రకమైన నామం ఉంటే మరో భంగిమలో శృం** చేస్తారట. ఆయన ఈ మాటలు చెప్పేటప్పుడు మహిళలు కూడా ఎదురుగా ఉన్నారు. పొన్ముడి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది. అందరూ విురుచుకుపడ్డారు.
దీంతో డీఎంకే హైకమాండ్ పొన్ముడిని పార్టీ పదవి నుంచి తీసేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ మంత్రి పదవి నుంచి తీసేయలేదు. ఈయన ట్రాక్ రికార్డు తక్కువదేమీ కాదు. మద్రాస్ హైకోర్టు అక్రమాస్తుల కేసులో ఆయనకు శిక్ష వేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. శిక్ష ఖరారు అయినప్పుడు ఆయనపై అనర్హతా వేటు పడింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చాక మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకున్నారు స్టాలిన్. ఇప్పుడు కూడా మంత్రి పదవి నుంచి తీసేయడానికి ఆయన సిద్ధంగా లేరు.