తెలుగు360 ఎడిటర్స్ కామెంట్ : నిజం..ఇట్స్‌ ఏ లై ! ఇదే రాజకీయ మీడియా నైజం..!

అసలు నిజం అంటే ఏమిటి…?
నిజం అంటే అబద్దం….! ఎగ్జాట్లీ అబద్దం..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్న వ్యవహారం ఇదే. మీడియాను.. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ఆడుతున్న వికృత సమాచార వ్యాప్తి క్రీడలో.. నిజం.. నిట్ట నిలువుగా బలి అవుతోంది. అసలు జరిగింది చెప్పడం కన్నా… జరగని దాన్ని ఎక్కువగా చేసి.. రివర్స్‌లో.. ప్రజలకు చెబుతూ.. అదే నిజమని నమ్మిస్తూ.. వంచిస్తూ.. రాజకీయ మీడియా పయనం సాగిస్తోంది.

అబద్దమైనా సరే.. ఎక్కువ మందిని నమ్మించగలిగితే అదే నిజం..!
 
రెండు లక్షలకు.. రెండు వేల కోట్లకు తేడా ఎంత..? ఊహించలేనంత ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ తేడా చాలా స్వల్పం. ఎంత అంటే.. రెండు లక్షలనే రెండు వేలకోట్లుగా జనం నమ్మించేంత. ఒక్క ఐటీ దాడుల విషయంలోనే కాదు.. రాజధాని దగ్గర్నుంచి కియా పరిశ్రమ వరకు.. అసలు జరుగుతోంది ఒకటి..   మసిపూసి మారేడుకాయ అయి ప్రజలకు చేరుతోంది మరొకటి.  మూడు బడా ఇన్‌ఫ్రా కంపెనీలు, ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఏ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఆ మూడు కంపెనీలల ఖాతాలన్నీ.. ఆ ప్రముఖ వ్యక్తి మాజీ పీఏకు అంటగట్టేశారు. తీరా ఐటీ పంచనామా రిపోర్ట్ వచ్చాక.. మేము అలా అనలేదని వేరే వాదన వినిపించారు. కానీ అప్పటికి జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. రూ. రెండు వేల కోట్లట… అని  తమను గుడ్డిగా నమ్మేవారిలో ఓ స్థిరాభిప్రాయాన్ని ఏర్పర్చేశారు.  ఒక్క ఐటీ దాడుల విషయంలోనే కాదు..  కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవడానికి సిద్దమవుతోందని..అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం రాసింది. కానీ ఆ సంస్థ ఫేక్ అని.. మరొకటని.. టీడీపీ వాళ్లు రాయించారని .. ఆ రిపోర్టర్‌పై రాయిటర్స్ చర్యలు తీసుకుందని ప్రచారం చేశారు. కానీ రాయిటర్స్ చాలా స్పష్టంగా కియా ఏపీ నుంచి వెళ్లడానికి సిద్ధమయిపోయిందని చెబుతోంది. దాన్ని మాత్రం చెప్పడం లేదు. ఇక రాజధాని అమరావతి విషయంలో  చేస్తున్న.. చేసిన ప్రచారాలకు లెక్కే లేదు. ముంపు ప్రాంతమని.. మద్రాస్ ఐఐటీ రిపోర్టని.. ఖర్చు ఎక్కువని.. ఒక సామాజికవర్గానిదని.. స్మశానమని.. విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రం అమరావతి రాష్ట్రపరిధిలోని అంశమని చెప్పినా.. ఆ పరిధిలోన గత ప్రభుత్వం రాజధానిని ఖరారు చేసిందని.. తాము నోటిఫై చేశామని కూడా తేల్చేసింది. అంటే.. అసలు జరిగిందానికి భిన్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. దాన్నే ప్రజలు నమ్మేలా చేయగలిగితే చాలు.. అదే నిజమవుతుందని భావిస్తున్నాయి.

అధికార, ప్రతిపక్షాలు దొందూ.. దొందే..!

ఈ విషయంలో… ప్రతిపక్ష పార్టీది తక్కువ పాత్రేమీ కాదు. ఆ పార్టీ కూడా… కౌంటర్‌గా.. నిమ్మగడ్డ.. సెర్బియా.. రస్ అల్ ఖైమా అంటూ.. కొత్త కొత్త వ్యవహారాల్లో వెలగులోకి తెస్తూ. ప్రజల్ని మరింత గందరోళగానికి గురి చేస్తోంది. తమ మీద  ఆరోపణలు వచ్చే ముందే.. ఎదుటి పార్టీపై బురద చల్లాలనే అత్యుత్సాహమే ఈ పరిస్థితి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజల్ని నమ్మించడం ద్వారా.. తమపై ఆరోపణల తీవ్రతను తగ్గించుకోవాలనుకుంటున్నాయి. ఇప్పుడు రాజకీయం పూర్తిగా ప్రజల్ని నమ్మించడం మీదనే ఆధారపడి ఉంది.  ఎక్కువ మంది నమ్మేదే నిజంగా.. రాజకీయ పార్టీలు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ , అక్కడంతా ఒకే సామాజికవర్గం వారు ఉంటారు… ఐటీ సోదాల్లో రెండు వేల కోట్లు దొరికాయి… అన్నీ ఇలాంటి కోవలోకే వస్తాయి. ఐటీ సోదాల్లో మూడు బడా ఇన్‌ఫ్రా కంపెనీల్లో దొరికింది 71 లక్షల రూపాయలు. చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో గుర్తించింది రెండున్నర లక్షలు.  కానీ దాన్నే రెండు వేల కోట్లు అని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక అబద్దం వంద సార్లు చెబితే నిజం అయిపోతుందనే నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడు ఐటీ పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత తాము డబ్బులనలేదని.. లావాదేవీలు అంటున్నామంటున్నారు. ఆ మూడు బడా ఇన్‌ఫ్రా కంపెనీలకు.. చంద్రబాబు మాజీ పీఎస్‌కు సంబంధం ఏమిటో మాత్రం చెప్పరు. తాము చెప్పే రెండు వేల కోట్ల లెక్క ప్రజల్లోకి వెళ్తే అదే నిజమవుతుందని రాజకీయ నేతల అంచనా

ప్రచారం మీదే నడుస్తున్న ఏపీ రాజకీయం ..!

మిగతా రాష్ట్రాల్లో రాజకీయం వేరు.. ఏపీలో రాజకీయం వేరు. రేపే ఎన్నికలన్నంత హడావుడి.. ఫలితాలొచ్చిన తర్వాతి రోజు నుంచే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా విశ్రాంతి తీసుకోదు. ఆయా పార్టీల కార్యకర్తలూ అంతే. అయితే.. ఇక్కడ సమస్య అంతా… రాజకీయ పార్టీల స్ట్రాటజీ వల్లనే వస్తోంది.  తమకు వ్యతిరేకం అయినా…ప్రత్యర్థి పార్టీపై అవాస్తవాలు చాలావేగంగా ప్రచారం చేసి.. ఎక్కువ మంది నమ్మేలా చేయగలిగితే..చాలని అనుకుంటున్నాయి. ఇందు కోసం.. ఆన్ లైన్ టీముల్ని నియమించుకుంటున్నాయి. దాంతో..  ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. స్పష్టంగా కనిపిస్తున్న విషయాలను కూడా వక్రీకరిస్తున్నారు.  ఫలితంగా ప్రజలు కూడా.., అసలు నిజలేంటో అంచనా వేసులేకపోతున్నారు. తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న వార్తను.. నమ్మి సంతృప్తి పడుతున్నారు. కానీ వారికి అసలు నిజం తెలియడం లేదు. తెలిసిన నమ్మలేనంతగా.. రాజకీయ పార్టీలు.. ఆ విషయానికి మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయి.

రాజకీయ గుప్పిట్లో ఇరుక్కున్న మీడియాది కూడా తప్పుడు మార్గమే..!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిఖార్సైన మీడియా లేదు. రాజకీయ మీడియా మాత్రమే ఉంది. యాజమాన్యాలు మారే కొద్దీ విధానాలు మార్చుకునే మీడియా ఉంది. అయితే.. నిన్నామొన్నటి వరకూ.. ఎలాంటి పరిస్థితి ఉన్నా… నిజాలను కాస్త నిజాయితీగా చెప్పే మీడియా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగినప్పుడు.. రూ. వెయ్యి కోట్ల ఆస్తులంటూ.. మీడియా ప్రకటించింది. డాక్యుమెంట్లు ప్రసారం చేసింది. అవన్నీ ఫేక్ అని తేలిన తర్వాత ఒక్క మీడియా సంస్థ కిక్కురమనలేదు. వారికి కావాల్సింది రేవంత్ పై దుష్ప్రచారం. అలాగే.. నిన్నామొన్నటి ఐటీ దాడుల వ్యవహారం. ఆయా చానళ్లకు.. ఆ చానళ్ల యజమానుకు కావాల్సింది.. నిజం కాదు.. ఆ నిజం పేరుతో.. రాజకీయ ప్రత్యర్థులపై అలాంటి ప్రచారం జనల్లోకి వెళ్లడం, కథలు కథలుగా చెప్పుకోవడం. ఇప్పుడు మీడియాను రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. టీడీపీ మీడియా టీడీపీకి.. వైసీపీ మీడియా వైసీపీకి ఉన్నాయి. ఒకరిపై ఒకరు బురదచల్లుకోవడం… నిజాలను వక్రీకరించి.. జరిగిన వాటిని తమకు అనుకూలంగా.. ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ఎక్కువ మందిని నమ్మించేలా చేయడంలో మునిగిపోయింది.

అందుకే.. ఇప్పుడు మీడియాలో వచ్చేదంతా.. నిజం.. ఇట్స్ ఏ లై.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

ఫ్లాష్ బ్యాక్‌: శోభ‌న్ బాబు క‌న్నీరు పెట్టిన వేళ‌!

ఏ విజ‌య‌మూ సుల‌భంగా రాదు. ఎన్నో ఆటు పోట్లు. అవ‌మానాల క‌ల‌యికే.. విజ‌యం. అలాంటి విజ‌యాలు మ‌రీ మ‌ధురంగా ఉంటాయి. ఏ స్టార్‌జీవితాన్ని తీసుకున్నా - ఎన్నో ఒడిదుడుకులు. 'నువ్వు న‌టుడిగా ప‌నికొస్తావా'...

HOT NEWS

[X] Close
[X] Close