టిఏజిసి 2020 సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు

చికాగో, ఫిబ్రవరి 2: మొట్టమొదటి తెలుగు సంస్థ అయిన చికాగో మహానగర తెలుగు సంస్థ (టిఏజిసి) ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారి ఆడిటోరియంలో ఫిబ్రవరి 1 న మధ్యాహ్నం 2:30 ప్రారంభమై రాత్రి 10:00 వరకు చాలా ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి & శ్రీమతి క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ వెంకట్ గూనుగంటి, ముఖ్యకార్యదర్శి శ్రీ అంజిరెడ్డి కందిమళ్ల, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

శ్రీమతి నీలిమ ఛేకీచర్ల మరియు అలంకరణ సభ్యులు ముఖద్వారం, నృత్య వేదికను సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ ప్రతిమలతో సుందరంగా అలంకరించారు. నృత్యవేదిక ముందు బొమ్మల కొలువును చాలా చక్కగా ఏర్పాటు చేసారు. పిల్లలకు పతంగుల తయారీ పోటీ నిర్వహించి బహుమతులను ప్రధానం చేసారు.

శ్రీ అంజిరెడ్డి కందిమళ్ల, కోశాధికారి శ్రీ పాండురంగారెడ్డి లెంకల, కో-కోశాధికారి శ్రీ రమణ కాల్వ మరియు శ్రీ పరమేశ్వర యరసాని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీమతి ఉమా అవధూత మరియు ఇతర మహిళా వాలంటీర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ఆడపడుచులను సాంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి పన్నీరు చిలకరించి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో దాదాపు 1500 మంది సభ్యులు మరియు
అతిథిలు పాల్గొన్నట్లు సంస్థ సభ్యత్వ నమోదు కార్యదర్శి శ్రీ పరమేశ్వరరెడ్డి యరసాని తెలిపారు.

తెలుగు సాంప్రదాయినికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలిపే బాలుర నృత్యప్రదర్శన, రైతుల ప్రాముఖ్యాన్ని మరియు వారి కష్టాలను వివరించే ‘జైకిసాన్’ పర్యావరణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే “వనం” కార్యక్రమం, ప్రస్తుత సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించే ‘విమెన్ఎంపవర్మెంట్’ నాటిక, గణతంత్ర దినోత్సవం మరియు వివిధ చిత్రగీతాల మాలిక ‘చిత్రలహరి’ ప్రోగ్రాం, చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం మరియు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 32 టీంల ద్వారా 350 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనకారులకు టిఏజిసి తరుపున సర్టిఫికెట్స్, వినూత్నంగా పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కో-ఆర్డినేటర్స్ కు అందజేశామని సంస్థ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి తెలిపారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్స్ శ్రీమతి శిరీష మద్దూరి, శ్రీమతి మాధవిరాణి కొనకళ్ల, శ్రీమతి శిల్ప పైడిమర్రి, శ్రీ శ్రీకాంత్బేతి మరియు కూర్పుకర్తలు, సమన్వయకర్తలుకు ధన్యవాదములు తెలిపారు.


ఈ ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు వడ్డించటానికి సంక్రాంతి పండుగ పిండివంటలైన నేతి అరిసెలు, చెక్కినాలుతోపాటు ఉలవచారు, వడియాలు, చల్ల మిరపకాయలు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రత్యేకంగా తెప్పించామని మరియు వీటితో పాటుగా వివిధ రకాలైన ఆహారాలను బావార్చి రెస్టారెంట్ Naperville వారు సమకూర్చారని, కొన్ని వంటకాలను మట్టి కుండలలో పెట్టి వడ్డించామని, విందు భోజనం చాలా రుచికరంగా ఉందని, భోజనశాల అలంకరణ చాలా బాగుందని అతిథులు ప్రశంసించారని ఫుడ్ కమిటీ కార్యదర్శి శ్రీ సంతోష్ కొండూరి తెలిపారు. ఆహార ఏర్పాటులను పర్యవేక్షించిన యూత్కార్యదర్శి శ్రీ విజయ్బీరం, శ్రీ వెంకట్గూనుగంటి, శ్రీ శశి చావా, శ్రీ నవీన్ఎడుమ, శ్రీ రోహిత్ఆకుల, శ్రీ శ్రీధర్అలవల మరియు వాలంటీర్లుకు శ్రీ సంతోష్ కృతఙ్ఞతలు తెలిపారు.

ఈరోజు జరిగిన కార్యక్రమాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫోటోలు, లైవ్ వీడియోల రూపంలో ప్రదర్శించటం జరిగిందని, మరిన్ని ఫోటోలు, వీడియోలను https://www.tagc.org/photos.php వెబ్సైటు ద్వారా చూడవచ్చని మీడియా కార్యదర్శి శ్రీ శ్రీధర్అలవల తెలిపారు.

ఇల్లినాయిస్ స్టేట్ మెడికల్ డిసిప్లినరీ బోర్డుకు ఇల్లినాయిస్ గవర్నర్ నీయమించిన తెలుగు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించటం జరిగినది. ఈ కార్యక్రమంలో డొనేషన్ ద్వారా సేకరించిన నిధులను టిఏజిసి నెల్లూరుకి చెందిన విశ్వభారతి బ్లైండ్స్కూల్కి విరాళంగా అందించింది. విశ్వభారతి బ్లైండ్ స్కూల్ అంధులు అయినా అనాధ బాలబాలికలను దరిచేర్చి వారికీ సహాయ సహకారాలు అందించే ఒక స్వచ్చంద సంస్థ.

రెండు చేతులు లేనిదే చప్పెటలు మ్రోగవు, నలుగురు లేనిదే సభని అలంకరించలేము అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు. ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలని వెయ్యి రేట్లు అద్భుతంగా మరియు కన్నులపండుగగా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయసహకారాలు అందించిన దాతలకు, కళాకారులకు, కళాఅభిమానులకు ,కళాపోషకులకు , కూర్పుకర్తలు , సమన్వయకర్తలు ,కార్యకర్తలకు ,కార్యవర్గసభ్యులకు ,మిత్రులకు ,శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి ధన్యవాదములు తెలిపారు. జాతీయ గీతాలాపనతో కన్నులపండుగగా జరిగిన ఈ కార్యక్రమం ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close