2021 రివైండర్ : టాక్ ఆఫ్ ది టాలీవుడ్

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్: 2018 ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఎన్నికల వ్యవహారాల్లో బిజీ అయిపోయారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ ఇక పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతారని ఇంక ఆయన నుంచి సినిమా రావడం కష్టమేనని భావించారంత. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జనసేన ఆశించిన స్థాయిలో రాలేదు. ఇదే సమయంలో పవన్ సినిమాలు చేయాల్సిందేనని అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగింది. చాలా చర్చలు తర్వాత మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టారు పవన్. ‘వకీల్ సాబ్’ తో 2021లో మళ్ళీ ఆయన వెండితెరపై సందడి చేశారు. పవన్ నిర్ణయం ఆయన సినిమాలని అభిమానించే అభిమానులని ఖుషి చేసింది.

సమంత- నాగ చైతన్య విడాకులు:

అక్కినేని కుటుంబంలో మరో విడాకులు. నాగ చైతన్య- సమంత విడిపోయారు. దాదాపు పదేళ్ళు ప్రేమలో వుండి పెళ్లితో ఒక్కటైన సామ్ చై మూడేళ్ళకే వివాహ బంధానికి స్వస్తి పలికారు. విడాకుల కారణం వారి వ్యక్తిగతం. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి విడాకులు వివాదమైయింది. సమంతపై చాలా ట్రోలింగ్ జరిగింది. సామ్ కారణంగానే విడిపోయారని, ఆమెకు వేరే బంధం వుందని ఇలా చాలా రూమర్స్ వినిపించాయి. అయితే రూమర్స్ శ్రుతి మించిపోవడంతో సామ్ కోర్టు వరకూ వెళ్లి సోషల్ మీడియా నోటికి తాళం వేయాల్సివచ్చింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా వుంది సామ్.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్: సాయి ధరమ్ తేజ్ 2021 చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ .. కోమాలో వెళ్ళాడు. దాదాపు వారం రోజులు వైద్యులు కూడా సాయి ఆరోగ్యం పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో కలకలం రేపింది. సాయి కోసం చాలా మంది మెగా అభిమానులు పూజలు, ప్రార్ధనలు చేశారు. పూజలు ఫలించాయి. సాయి హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగొచ్చాడు. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ స్పీచ్: ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. సినిమా టికెట్ ధరలు తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ అంశంపై హాట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ ఒక పొలిటికల్ లీడర్ కూడా కావడంతో కామెంట్స్ రాజకీయ రంగు పులుముకున్నాయి. ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు పవన్‌ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడ్డారు. న్యూస్ ఛానల్స్ లో ఇదే అంశంపై డిబేట్లు నడిచాయి. అయితే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పెదవి విప్పలేదు. నిర్మాతల మండలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో పరిశ్రమకు సంబంధం లేదని ప్రకటించింది. మొత్తానికి ఆ వివాదాన్ని పవన్ వంటరిగానే ఎదురుకున్నాడు.

పోసాని ప్రెస్ మీట్: రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కు కౌంటర్ గా పోసాని కృష్ణ మురళి పెట్టిన రెండు ప్రెస్ మీట్లు పెను సంచలనం రేపాయి. మొదటి ప్రెస్ మీట్ లో పవన్ ని విమర్శించడానికి కంకణం కట్టుకున్న పోసాని,, రెండు ప్రెస్ మీట్ కి వచ్చేసరికి బరితెగించి మాట్లాడారు. పలకడానికి సంస్కారం అడ్డు వచ్చే భాషని వాడి హద్దులు దాటారు. పోసాని చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దాదాపు పోసాని ప్రెస్ మీట్ చుట్టే వారం రోజులు పాటు మీడియా కధనాలు తిరిగాయి. పోసానిని ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందనే కధనాలు కూడా ఒక దశలో వినిపించాయి. అయితే ఈ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ మీడియాకి ఎదురుపడలేదు పోసాని.

మా ఎన్నికలు: ఈ ఏడాది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచిన మరో అంశం మా ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలంతా సీరియస్ గా జరిగాయి. మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ ఇద్దరూ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. మామూలు పోటీ కాదు.. ఓటుకు నోటు, విందులు, రిస్టార్ట్ రాజకీయాలు.. ఈ సీన్లు అన్నీ కనిపించాయి. మధ్యలో వర్గ పోరాటం కూడా కనిపించింది. ఇండస్ట్రీలో రెండు వర్గాల మధ్య పోరు అన్నట్లు ప్రచారం జరిగింది. చివరిగా మంచు విష్ణు ‘నాన్ లోకల్’ అస్త్రం ప్రయోగించాడు. తెలుగు పరిశ్రమని చూసుకోవడానికి తెలుగువాడు సరిపోడా ? ఎక్కడో నుంచో తెచ్చుకున్నవారు కావాలా ? అని స్థానికత తెరపైకి తెచ్చారు. మొత్తానికి ఎన్నికల్లో విష్ణు గెలిచాడు. అయితే ఎన్నికలు జరిగి తీరుని ఆక్షేపిస్తూ .. ప్రకాష్ రాజ్ ప్యానల్ మొత్తం రాజీనామా చేసింది. ప్రెస్ మీట్ పెట్టి పోలింగ్ రోజు మోహన్ బాబు చేసిన రౌడీయిజం గురించి బెనర్జీ, తనీష్ ఇంకొందరు సభ్యులు మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. దీనికి కౌంటర్ గా విష్ణు- నరేష్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు కేవలం విష్ణు ప్యానల్ మాత్రం ‘మా’ వ్యవహారాలు చూసుకుంటుంది.

సిరివెన్నెల: చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఓ లెజెండ్ ని కోల్పోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి వెళ్ళిపోయారు. సినిమా పాటకు తన కవిత్వంలో పట్టాభిషేకం చేసి ప్రేక్షకుల మదిలో వెన్నెల కురిపించిన కలం ఆగిపోవడం సినిమా పాటకే తీరని లోటు. సుధీర్గ తన ప్రయాణంలో సినిమా పాట మాటున గొప్ప కవిత్వం రాసేసిన గేయ రచయిత సిరివెన్నెల. ఆయన శైలి, శిల్పం మరో రచయితకి లేదు, రాదు. సినిమా పాటకు గొప్ప కవిత్వాన్ని జోడించే కవి, కథని ఒక్క వాక్యంలో చెప్పగలిగే రచయిత, ఒక్క లైన్ తో అలోచన ధోరణి మార్చేసే దూరదర్శి.. ఇలా ఎన్ని కోణాల్లో ఆయన పాట గురించి చెప్పుకున్నా ఇంకా ఎన్నో కోణాలు మిగిలిపోతాయి. వేటూరి వెళ్ళిపోయిన తర్వాత పాత కొత్త తరాలకు ఒక వారధిలా నిలిచారు సిరివెన్నెల. ఇప్పుడు సిరివెన్నెల కూడా వెళ్ళిపోవడంతో ఒక వారధి కూలిపోయినట్లయింది.

ఏపీలో సినిమా టికెట్ల ధరలు: గత ఏడాది చిత్ర పరిశ్రమని కరోనా కాటేస్తే.. ఈ ఏడాది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కష్టం తెచ్చిపెట్టింది.
ఏపీ సర్కార్ తీసుకున్న సినిమా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంతో సినీ పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకమైయింది. పాతికేళ్ళ క్రితం నాటి ధరలు ఇప్పుడు ఏపీలో వున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా తగ్గితే ఆనందం. కానీ ఒక్క సినిమా టికెట్టు ధరని పాతాళానికి దించేశారు. ప్రభుత్వానికి ఈ సలహా ఇచ్చింది ఎవరు ? దిని వెనుక రాజకీయం ఏమిటో కానీ.. ఈ నిర్ణయంతో సినిమాని నమ్ముకొని బ్రతుకుతున్న కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి. ఇప్పటికే వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. ఒక థియేటర్ కి కనీసం పదిమంది పని చేస్తారు. ఈ రకంగా వందల కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి. ఇక కోట్లు ఖర్చు చేసి సినిమా తీసిన నిర్మాతలు, ఆ సినిమా నమ్ముకొని పని చేస్తున్న కార్మికుల పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. వారికి ఏ దిక్కు తోచడం లేదు. ప్రస్తుతం ఏపీలో సమోసా ధర కంటే సినిమా టికెట్ ధర తక్కువ. ఇదే పాయింట్ పై హీరో నాని మాట్లాడితే మంత్రులు సైతం విరుచుకుపడ్డారు. హీరోలు కోట్ల పారితోషకం తీసుకొని ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారని అన్నారు. మంత్రుల మాటలు విన్న తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి కారణం హీరోల పారితోషికమా? అనే కోణం కూడా తెరపైకి వచ్చింది. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న సమస్యకి తొందరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close