గాలి వారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశమంతా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో షాక్‌లో ఉంటే… డబ్బులు చల్లి అత్యంత ఘనంగా ఈ పెళ్లి చేసిన గాలి.. ఆ షాక్కే షాక్ ఇచ్చాడు. సినిమా సెలబ్రెటీలను తన పెళ్లికి రప్పించడానికి, వాళ్లతో చిందుకు వేయించడానికి గాలి వేసిన ఎత్తుగడ సత్ఫలితాలను ఇచ్చింది. ఎవ్వరూ ఊహించని రెమ్యునరేషన్లతో హీరోయిన్లను ఆకర్షించి.. తన ఇంట పెళ్లికి రప్పించాడు వాళ్లతో చిందులు వేయించాడు రకుల్, తమన్నా, కేథరిన్, ప్రియమణి, శాన్వి… వీళ్లంతా గాలి పెళ్లిలో సందడి చేశారు.. డాన్సులు వేశారు. వీళ్లకొకొక్కరికీ ఆయన ఇచ్చిన డబ్బు కట్టల సంగతి తెలిస్తే… అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. తమన్నా కి రూ.70 లక్షలు, రకుల్‌కి రూ.20 లక్షలు, శాన్వి, ప్రియమణిలకు చెరో పదిహేను లక్షలు పారితోషికంగా ఇచ్చేవారట. రకుల్‌కీ బాగానే గిట్టుబాటు అయ్యేది. కానీ.. ఈ పెళ్లికి హాజరవ్వడం తనకో ఆబ్లికేషన్గా మారిందని, అందుకే రూ.20 లక్షలతో సరిపెట్టుకోవాల్సివచ్చిందని తెలుస్తోంది.
ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించినందుకు సాయికుమార్‌కి రూ.25 లక్షల వరకూ ముట్టిందట. బ్రహ్మానందం రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఇలా ఏ సెలబ్రెటీ వెళ్లినా.. వాళ్లకు ఓ డబ్బుమూట ముట్టిందని కేవలం సినీ సెలబ్రెటీల కోసమే కనీసం రూ.5 కోట్లు కేటాయించారని దాన్ని బట్టి ఈ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో ఊహించుకోవొచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.