అఫీషియ‌ల్‌: ట‌బు పాత్ర‌లో త‌మ‌న్నా

బాలీవుడ్ లో విజ‌య‌వంత‌మైన `అంధాధూన్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరో. కాక‌పోతే.. అక్క‌డ ట‌బు చేసిన పాత్ర ఇక్క‌డ ఎవ‌రితో చేయించాల‌న్న విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డింది. న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్ల‌ని సంప్ర‌దించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ట‌బునే తీసుకుందాం అనుకున్నా. శ్రియ పేరు కూడా గ‌ట్టిగా వినిపించింది. చివ‌రికి.. త‌మ‌న్నాకి ఫిక్స‌య్యారు. ఈ విష‌య‌మై చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ట‌బు స్థానంలో… త‌మ‌న్నాని ఫిక్స్ చేసింది. క‌థానాయికగా న‌భా న‌టేషా న‌టించ‌నుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాత‌లు. “ట‌బు పాత్ర‌కు హిందీలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపిస్తుంది. రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌లో న‌భా న‌టిస్తుంది. ప్ర‌తీ పాత్ర‌కూ ఈ క‌థ‌లో ప్రాధాన్యం ఉంది“ అని చిత్ర‌బృందం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోర్టు నుంచి స్టే వస్తుందనే అర్థరాత్రి కూల్చివేతలు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, సానుభూతి పరుల ఆస్తులపై అటు వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.. ఇటు ప్రభుత్వం కూడా తమకు దఖలు పడిన అధికారాన్ని ఉపయోగించుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతోందన్న ఆరోపణలు...

ఐపీఎల్‌లో చేజింగ్ సండే..!

ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత...

హ‌మ్మ‌య్య… చెన్నై గెలిచింది!

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. వ‌రస ప‌రాజ‌యాల‌కు చెన్నై బ్రేక్ వేస్తూ.. ఓ చ‌క్క‌టి విజ‌యాన్ని అంకుంది. అందులోనూ వ‌రుస విజ‌యాల‌తో ఊపులో ఉన్న‌... బెంగ‌ళూరు జోరుని అడ్డుకుంది. ఫ‌లితం.. చెన్నై...

ప‌వ‌న్ వ‌స్తే… లెక్క‌ల‌న్నీ మారాల్సిందే

ఎట్ట‌కేల‌కు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దాంతో ఈ రీమేక్ పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. బాల‌కృష్ణ - ర‌వితేజ‌, రానా - ర‌వితేజ‌... ఇలా చాలా...

HOT NEWS

[X] Close
[X] Close