తెలకపల్లి రవి : భరద్వాజ అయినా చెబుతారా? గరుడ శివాజీ బాటేనా?

హీరో శివాజీ నాతో ఆపరేషన్‌ గరుడ ( లేదా ద్రవిడ ) గురించి ప్రస్తావించిన తర్వాత ఏడాదికి అమలు జరిగిందంటున్నారు. ఇంతకాలంలోనూ దాని గురించిన ఏ వివరాలు తెలుసుకోవడం లేదా నిలుపుచేయడం ఎపి పోలీసులు నిఘా విభాగం చేతకాలేదు. కనీసం ఆయనను పిలిచి మాట్లాడ్డమైనా వారు చేయలేకపోయారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టి ఆయన మంత్రులు ముఖ్య నేతలు అందరూ దాన్ని భగవద్గీతలా వల్లె వేస్తూనే వున్నారు. నిజంగా ప్రభుత్వాన్ని ప్రజలను ప్రభావితంచేసే సమాచారం ఏదైనా వుంటే పోలీసులతో పంచుకోవలసిన శివాజీ కూడా ఆ పనిచేసింది లేదు. దీనిపై ఏదైనా సందేహం వుంటే నాతో ఇంటర్వ్యూలో తాజాగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప తమకు తెలిసింది చెప్పాలనే బాధ్యత శివాజీకీ చెప్పించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోయింది. మహారాష్ట్ర కోర్టు వారంటు ఇస్తే ఇదే అన్నారు, ఐటి దాడులు జరిగితే ఇవే అన్నారు. మరి మీరు చెప్పే ప్రకారం జగన్‌ బలిపశువు కదా ఆయనపై కుట్ర ఆరోపణ ఎందుకు చేస్తున్నారంటే సమాధానం లేకపోయింది. ఈ ప్రశ్న అడిగింది కూడా నేను తప్ప వైసీపీకి టిడిపికి కూడా ఇష్టం లేకపోయింది.

పాత ఆపరేషన్‌ కథలతో పలచనైంది చాలక ఇప్పుడు ఆపరేషన్‌ గరుడ మరొక హడావుడి మొదలుపెట్టారు.ఈ సారి దర్శక నిర్మాత వ్యాఖ్యాత తమ్మారెడ్డి భరద్వాజ ముందుకొచ్చారు. టివి5లో మూర్తి చర్చకు పెట్టారు. పెద్దవారు పాత మిత్రులు గనక తమ్మారెడ్డిని లేదా మూర్తిని ఏమీ అనడం లేదు. కాని ప్రభుత్వం నిఘా విభాగం ఏం చేస్తున్నాయనే ప్రశ్న మళ్లీ అడగాల్సి వచ్చింది. గరుద పురాణం నడుస్తుండగానే సో కాల్డ్‌ ఆపరేషన్‌ బి ముంచుకొస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? హైదరాబాదులో ఫిలిం నగర్‌లో వున్నవారికి తెలిసే మీకెందుకు తెలియడం లేదు? ఇది వైఫల్యమని ఒప్పుకుంటారా లేక బూటకమని కొట్టి పారేస్తారా? శివాజీ చెప్పలేదు గాని భరద్వాజ అయినా పోలీసులకు తన సమాచారం చేరుస్తారా? లేక టీవీ చర్చలతో ఆపేస్తారా? ఇప్పుడు కూడా మళ్లీ ఐటి దాడులనే అంఉన్నారు. అలాగైతే ఇది మరో ఆపరేషన్‌ ఎందుకైంది?గరుడ కొససాగింపు అనుకోవచ్చు కదా!

బిజెపి ఆరెస్సెస్‌లు అధికారం కోసం అవతలివారిని దెబ్బతీయడం కోసం పథకాలు పన్నడం మామూలే. కాని ఈ రెండు ఆపరేషన్లలోనూ ఐటి దాడులు తప్ప మరేమీ చెప్పడం లేదు. అందుకే దీన్ని టిడిపి వ్యాపారవేత్తలను సమర్తించేందుకు చేస్తున్న విఫలయత్నం అనొచ్చు. బిజెప ఆరెస్సెస్‌ మతతత్వ రాజకీయాలను కేంద్రీకృత పోకడలను ఎదుర్కొవాలంటే అది కట్టుకథలతో కుదిరేపని కాదు. రాజకీయ నిజాయితీతో నిశితంగా ఎదుర్కోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కెప్టెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిద్దూ.. ఇక కిరీటమే..!

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయం దెబ్బకు తట్టుకోలేక అవమానాలు భరించలేక ఆయన పదవీ త్యాగం చేసేశారు. ఇప్పుడు సిద్ధూకు ముఖ్యమంత్రి...

తరుణ్, పూరిల శాంపిల్స్‌లో డ్రగ్స్ లేవట..! అందరివీ లేనట్లేగా ?

నాలుగేళ్ల కిందట తీసుకున్న శాంపిల్స్‌ టెస్టుల ఫలితాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది. తరుణ్ , పూరి జగన్నాథ్‌ల నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్‌లోని 2017లోనే ఎఫ్ఎస్ఎల్‌...

తృణమూల్‌లోకి బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కూడా జంప్!

బెంగాల్ బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు వలస వచ్చిన నేతలంతా వరుస కట్టి బయటకు పోతూంటే... ముందు నుంచీ ఉన్న నేతలు కూడా.. అదే బాట పడుతున్నారు....

డ్రగ్స్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్ !

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఎక్కువగా కేటీఆర్‌ను టార్గెట్ చేసే చేశారు కానీ...

HOT NEWS

[X] Close
[X] Close