రాజధానిపై ఎన్నికలకు వెళ్లాలని స్పీకర్ సలహా..!

రాజధానిపై అధికార,ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు వెళ్తే మంచిదేనని స్పీకర్ తమ్మినేని సీతారాం సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా… రాజధానిపై ప్రజాభిప్రాయసేకరణ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు అమరావతినే రాజధానిగా అంగీకరించారని.. ఇప్పుడు ప్రజల్ని మోసం చేసి… మూడు రాజధానులు అంటున్నరాని ప్రజాభిప్రాయం తీసుకోవాలని..ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు..రెండు విడుతలుగా సవాళ్లు కూడా చేశారు. అయితే రాజీనామాలు చేసే ప్రశ్నే లేదని కావాలంటే టీడీపీ నేతలు రాజీనామాలు చేయవచ్చని…వైసీపీ నేతలు సలహా ఇచ్చి సరి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా స్పీకర్ నోటి వెంట..ఎన్నికల మాట రావడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అదే సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా ముందు మాట్లాడితే…ఆ స్పీకింగ్ చాలా ఘాటుగా ఉంటుంది. గతంలో సంగతేమో కానీ..స్పీకర్ అయిన తర్వాత అదే పరిస్థితి. చంద్రబాబు గుడ్డలిప్పదీస్తాం అన్న దగ్గర్నుంచి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల వరకూ చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన వాయిస్‌లో బేస్ మారిపోయింది. ఆయన చాలా స్మూత్‌గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిచాలా ఆరోగ్య కరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాల సవాళ్లు ప్రజాస్వామ్య పరంగా ఉన్నాయంటున్నారు. నిన్నటి వరకూ స్పీకర్ ..తాను అసెంబ్లీలో మాత్రమే స్పీకర్‌నని..బయట వైసీపీ నేతనన్నట్లుగా ప్రతిపక్షపార్టీని దారుణంగా విమర్శించేవారు. ఇప్పుడు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తున్నారని సర్టిఫికెట్ ఇస్తున్నారు.

తమ్మినేని సీతారంలో ఈ మార్పు రావడానికి కారణం ..హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడమేనని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. న్యాయవ్యవస్థపై తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. సభలో కాకుండా ఆ వ్యాఖ్యలు బయట చేసినందున.. తమ్మినేని పై కోర్టుధిక్కార చర్యలు తీసుకోవచ్చని తేల్చేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల వెనుక కుట్రఉందన్న అభిప్రాయంతో సీబీఐ విచారణకు ఆదేశించారు. సీబీఐ విచారణ ప్రారంభమైన స్పీకర్‌పై కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చన్న విశ్లేషణలున్నాయి. ఈ తరుణంలో తమ్మినేని వాయిస్ సాఫ్ట్‌గా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ దక్షిణాది వాదం అందుకున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని మొత్తం ఉత్తరాదిలో ఖర్చు పెడుతోందని...

సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ సర్కార్‌ది ధిక్కరణేనా..!?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎవరి మాటా వినాలనుకోవడం లేదు. హైకోర్టుపై నమ్మకం ఉందని.. ఏం చెప్పినా పాటిస్తామని మాటిచ్చి కూడా.. హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అనుకూల...

ఆర్కే పలుకు : అన్నపై కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెడతారా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం గ్యాప్ తీసుకుని... "హిలేరియస్ టాపిక్‌"తో కొత్తపలుకులు వినిపించారు. అన్న జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విబేధిస్తున్న షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇంత వరకూ...

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

HOT NEWS

[X] Close
[X] Close