తమ్మినేని దృష్టిలో ‘స్పీకర్‌’ అర్థం ఇదా?

శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి చెప్పినట్లుగా ఒక్కో పదానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఒక్కో భావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే తీరును బట్టి వారి వ్యవహారశైలి, ప్రవర్తన ఉంటాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం శంకరాభరణం సినిమా చూశారో చూడలేదో మనకు తెలియదు. చూసి ఉంటే ఆయన పదాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసేవారేమో…! ‘స్పీకర్‌’ అనే పదానికి మామూలు భాషలో మాట్లాడేవాడని, ఉపన్యాసకుడని అర్థం. ఏదైనా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రిక చూస్తే అందులో స్పీకర్స్‌ అని సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తారు. అయితే చట్టపభలో అంటే అసెంబ్లీలో, పార్లమెంటులో (లోక్‌సభలో) స్పీకర్‌ అంటే సభను క్రమబద్ధంగా నడిపించేవాడని అర్థం. ఇదో రాజ్యాంగబద్ధమైన పదవి. గౌరవనీయమైన పదవి.

దీనికి ఎన్నికయ్యేది అసెంబ్లీలో ఎమ్మెల్యే, పార్లమెంటులో ఎంపీ అయినప్పటికీ ఆ పదవిలో కూర్చున్న తరువాత తాను ఎంపీని, ఎమ్మెల్యేను అనే విషయం మర్చిపోవాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. అన్ని పక్షాలను సమానంగా చూడాలి. స్పీకరుకు సభ నిర్వహణ తప్ప ఇతర రాజకీయ వ్యాపకాలు ఉండకూడదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా తన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూనే, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే దైనందిన రాజకీయాల రొచ్చులో తల దూర్చకుండా హుందాగా వ్యవహరించాలి. కాని తమ్మినేని సీతారాం స్పీకర్‌ పదానికి అర్థం మరోలా అన్వయించుకొని, అంటే స్పీకర్‌ అంటే ఏదిబడితే అది మాట్లాడేవాడని అనుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఆయన పదవిలోకి వచ్చినప్పటినుంచి ఇదే ధోరణి. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన చేశాక ఆయన ఇక ఉండలేకపోతున్నారు. సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. ప్రతిపక్షం టీడీపీపై విరుచుకుపడుతున్నారు. అమరావతిలో వెళుతుంటే ఎడారిలో పోతున్నట్లుగా ఉందన్నారు. ఇది అమరావతి ప్రజలను అవమానించినట్లు కాదా? వారం రోజులుగా అమరావతి ప్రజలు మూడు రాజధానులు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేనికి చుర్రుమంటున్నది. ఇది టీడీపీ నేతలు చేస్తున్న, చేయిస్తున్న ఉద్యమంగా ఆయన చెబుతున్నారు. అమరావతిలో భూముల విలువ పడిపోయిందని ఆందోళన చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

భూములు కొట్టేసినవారే, పచ్చ చొక్కాలవారే ఉద్యమం చేస్తున్నారని అన్నారు. అమరాతిని లెజిస్లేచర్‌ కేపిటల్‌గా కొనసాగిస్తామని, ఇంకా ఏంటి మీ బాధ అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ఆమోదిస్తారా? లేదా? అమరావతిలో లెజిస్లేచర్‌ కేపిటల్‌ కావాలా? వద్దా? కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ చేసిన మూడు రాజధానుల ఆలోచన బ్రహ్మాండంగా ఉందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి పాలనను అన్ని ప్రాంతాలకు తీసుకెళుతుంటే ఇంకా ధర్నాలు, ఆందోళనలు ఎందుకన్నారు.

దేశంలో పౌరసత్వ చట్టం సవరణ బిల్లు మీద, ఎన్‌ఆర్‌సీ మీద పెద్దఎత్తున గొడవ జరుగుతోంది. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలూ జరిగాయి. దానిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడుతున్నారు. వారు ఏవేవో వివరణలు ఇచ్చుకుంటున్నారు. తాము చెప్పాల్సిందేదో చెబుతున్నారు. కాని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బహిరంగంగా ఏమీ మాట్లాడటంలేదు కదా. దేశంలో ఆందోళనలు చేస్తున్నవారిని తిట్టడంలేదు, విమర్శించడంలేదు కదా. ఎందుకంటే అది ఆయన పని కాదు. మరి తమ్మినేని ఎందుకు రెచ్చిపోతున్నారు. ఎందుకు ఒక ప్రాంతంవారిని పనిగట్టుకొని విమర్శిస్తున్నారు? ఆందోళన చేసేవారి పని సీఎం జగన్‌, హోం మంత్రి చూసుకుంటారు. స్పీకర్‌ అనవసరంగా మాట్లాడితే ప్రజల్లో ఆయన పరువు పోతుంది. విలువ తగ్గిపోతుంది.

మాజీ మంత్రి, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా ఆందోళనకారులను కించపరుస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. రోజూ టీవీల్లో కనబడటానికే ధర్నాలు చేస్తున్నారన్నాడు. ఈ ఉద్యమం నాటకమని, టీడీపీ నాయకులే చేయిస్తున్నారని మండిపడ్డాడు. ఈ ఉద్యమం నాటకమైతే టీడీపీ మీద, చంద్రబాబు మీద ఒంటికాలి మీద లేస్తూ, కోర్టుల్లో కేసులు వేసే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు ఎందుకు కనబడటంలేదు? మూడు రాజధానులపై ఎందుకు మాట్లాడటంలేదు? ఆందోళన చేస్తున్నవారిలో వైకాపా వారూ ఉన్నారనే విషయం తమ్మినేనికిచ ధర్మానకు తెలియదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close