తానా మహాసభల్లో హుషారెత్తించనున్న సంగీత విభావరులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు వాషింగ్టన్‌ డీసిలో ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, రంగస్థల నటులు,నృత్యకళాకారిణులు, గాయనీగాయకులు, సాహితీవేత్తలు, బిజినెస్‌ ప్రముఖులు ఇలా ఎంతోమంది హాజరవుతున్నారు.

ఈ (North American Telugu Community) మహాసభల్లో కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు వీలుగా వివిధ కమిటీలను తానా ఏర్పాటు చేసింది. అందులో కల్చరల్‌ కమిటీ తానాకు వచ్చే అతిధులకు, ఇతరులకోసం పసందైన కార్యక్రమాలను అందిస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి సంగీత విభావరితోపాటు, లలిల సంగీత గురువు రామాచారితో శిక్షణ శిబిరం, మహాసభల్లో లలితసంగీత విభావరి, టాలీవుడ్‌ గాయని సునీత లైవ్‌ పేరుతో ప్రత్యేక సంగీత విభావరి, ఇందులో హైదరాబాద్‌ కాప్రిసియో బ్యాండ్‌  కూడా పాల్గొంటోంది. మరో సంగీత దర్శకుడు తమన్‌ కూడా తానా వేడుకల్లో తన సంగీతంతో అందరినీ ఉత్సాహపరచనున్నారు.

ఎన్నో కార్యక్రమాలు…సంగీతానికే ప్రాధాన్యం

తానా మహాసభల్లో (North American Telugu Community) నిర్వహించే కార్యక్రమాల్లో సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చారు. హుషారునిచ్చే గీతాలాపన ఎందరినో పరవశింపజేస్తుంది. సంతోషపరుస్తుందనడంలో సందేహం లేదు. అలా ఎన్ని పాటలు విన్నా మన మనసు తవినితీరదు. అందుకే తానా తన కార్యక్రమాల్లో సంగీత విభావరికి పెద్దపీట వేసింది.

క్లాసికల్‌ డ్యాన్స్‌, ఫిల్మీ,ఫోక్‌ డ్యాన్స్‌, డ్రామా ఇతర కార్యక్రమాలతోపాటు టాలీవుడ్‌ సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులతో ప్రత్యేక సంగీత విభావరులను, లలిత సంగీతానికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక టాలెంట్‌ను ప్రోత్సహించి వారికి శిక్షణ ఇప్పించి తానా మహాసభల్లో వారిచేత పాడేలా కార్యక్రమాలను తానా కల్చరల్‌ కమిటీ రూపొందించింది.  ఇప్పటికే ఎంతోమంది కళాకారులు తానా మహాసభల్లో పాటలు పాడేందుకు, సంగీత విభావరి నిర్వహించేందుకు అంగీకారం తెలియజేశారు.

లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ (ఎల్‌ఎంఎ) ఆధ్వర్యంలో తానా మహాసభల్లో లలిత సంగీతం పాడేందుకు గురువు రామాచారి అమెరికా వస్తున్నారు. ఈ సందర్భంగా తానా ఆధ్వర్యంలో జూన్‌ 8 నుంచి 14 వరకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఉత్సాహవంతులైన యువతీ యువకులకు, చిన్నారులకు ఆయన లలిత సంగీతంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారితో తానా మహాసభల వేదికపై లలిత సంగీత ప్రదర్శనను నిర్వహించనున్నారు.

తానా మహాసభల (North American Telugu Community) ప్రారంభరోజున టాలీవుడ్‌ సంగీత దర్శకుడు తమన్‌ సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ఈ సంగీత విభావరిలో గాయని కౌసల్య, హరితేజతోపాటు గాయకులు సింహ, సుస్వరం అనిరుధ్‌ పాటలు పాడనున్నారు. జూలై 4వ తేదీన ఈ కార్యక్రమం జరగనున్నది. జూలై 5వ తేదీన సునీత లైవ్‌ పేరుతో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని సునీత ఈ కార్యక్రమంలో పాటలు పాడనున్నారు. ఆమెతోపాటు హైదరాబాద్‌కు చెందిన కుర్రకారుతో నిండిన కాప్రిసియో బ్యాండ్‌ సంగీతంతో హోరెత్తించనున్నది.

జూలై 6వ తేదీన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. గ్రాండ్‌ ఫైనల్‌ (grand finale) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంగీత విభావరిలో ఎంతోమంది గాయనీ గాయకులు పాల్గొని పాటలు పాడనున్నారు. నోయల్‌ సేన్‌, హేమచంద్ర, దీపు, పృథ్వీచంద్ర, మనీషా ఈరబతిని, దామిని భట్ల, మౌనిమ, శ్రీనిధి,సాహితీ, కళాభారవ్‌ తదితరులు ఇందులో పాటలను పాడనున్నారు.

ఇలాంటి మరెన్నో పసందైన కార్యక్రమాలతో, ఆటపాటలతో మీరు మెచ్చేలా, మనసుకు నచ్చేలా కార్యక్రమాలను తిలకించాలంటే వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోరడి. ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్‌ వెబ్‌సైట్‌ను www.tana2019.org చూడండి.

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close