అడ్రస్ మార్పులపై తానా వివరణ !

తానా ఎన్నికలలో సభ్యుల చిరునామాలకు సంబంధించి ఎలాంటి అపోహలకు తావులేదని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, కార్యదర్శి పొట్లూరి రవి ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులందరికీ ఓటు వేసే హక్కు కల్పించే ఉద్దేశ్యంతో చిరునామాల మార్పుకు సంబంధించి సభ్యులకు సమాచారం అందించడం జరిగిందని, చాలా మంది సభ్యులు తమ చిరునామాల మార్పుకు సంబంధించి గుర్తింపు పత్రాలు పంపారని, అన్నీ రకాలుగా దృవీకరించుకున్న తర్వాతే చిరునామాల మార్పు మీద నిర్ణయం ఉంటుందని తెలిపారు. సభ్యుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని బోర్డులో కూలంకషంగా చర్చించిన మీదట క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలుంటాయని అప్పటిదాకా చిరునామాల మార్పు జరగదని తెలిపారు. టెక్సాస్ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పోస్టల్ సర్వీసులు ఆగిపోయిన దృష్ట్యా 13వ తారీఖున చేరాల్సిన నామినేషన్ల గడువును మంగళవారం 23 ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు తెలిపారు. 13వ తేదీన లేదా 13వ తేదీ కంటే ముందు డెలివరీ డేట్ ఉన్న నామినేషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close