టార్గెట్ దీదీ.. ఈ సారి నారదా స్కాం….!

తృణమూల్ కాంగ్రెస్‌ బెంగాల్‌లో సంచలన విజయం సాధించినా.. బెంగాల్‌లో బీజేపీని సీబీఐ వెంటాడుతూనే ఉంది. గతంలో.. శారదా స్కాంలో నిందితులందర్నీ… బీజేపీలో చేర్చుకుని ఆ స్కాంలో విచారణను సీబీఐ పక్కన పెట్టేసింది. ఇంకా తమ పార్టీలో చేరని అతి కొద్ది మందిపై అప్పుడప్పుడూ రెయిడ్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా నారదా స్కాంలో నిందితులంటూ.. ఇద్దరు మంత్రులు.. ఓ ఎమ్మెల్యే.. మరో మాజీ మేయర్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపి ఆ తర్వాత అరెస్ట్ ప్రకటిస్తారని చెబుతున్నారు. బెంగాల్‌లో దారుణ పరాజయం ఎదురైనప్పటికీ.. బీజేపీ ప్రతిపక్షంగా ఎదిగింది.

తాము సంచలన విజయం సాధించి తీరుతామని అనుకున్న ఆ పార్టీ నేతలకు నిరాశ కలిగింది. ఆ తర్వాత బెంగాల్‌లో పరిస్థితులు ఏ మాత్రం కుదట పడలేదు. రాజకీయ హింస పేరుతో.. గవర్నర్ నివేదికల వరకూ వెళ్లింది. అప్పుడే రాష్ట్రపతి పాలన విధించాలనుకుంటున్నారన్న ఆరోపణలూ.. తృణమూల్ వైపు నుంచి వెళ్లాయి. ఇప్పుడు నారదా స్కాం అంటూ ఇద్దరు మంత్రుల్ని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వివిధ కేసుల్లో తృణమూల్ నేతల్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు.

బీజేపీ దూకుడు చూస్తే.. ఎంత భారీ మెజార్టీతో గెలిచినా బెంగాల్లో తృణమూల్‌ను టార్గెట్ చేయడం లేదని.. ప్లాన్ బీ అమలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు మరిన్ని కీలక పరిణామలు జరిగే అవకాశం కనిపిస్తోంది. స్వయంగా గవర్నర్ కూడా.. కార్యక్షేత్రంలోకి దిగి.. రాజకీయ దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడా ఆయనకు నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ హింస బాధితుల్ని బీేజపీ నేతలు తీసుకొచ్చి గవర్నర్‌తో పరామర్శలు ఏర్పాటు చేశారు. ఇక ముందు బెంగాల్‌లో ప్రజల గురించి పట్టించుకోవడం కన్నా రాజకీయమే ఎక్కువ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close