పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే తెదేపా అంత భయపడిపోవాలా?

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు, పవన్ కళ్యాణ్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రొమోషన్ కోసం రామ్ గోపాల్ వర్మ స్టైల్లో నాలుగు రాజకీయ డైలాగులు చెప్పగానే తెదేపా అప్రమత్తమయిపోయిందంటూ మీడియాలో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తమతో చేతులు కలిపితే సరేసరి, లేకుంటే ఆయనని డ్డీ కొనేందుకు నందమూరి బాలకృష్ణతో బాటు జూ.ఎన్టీఆర్, మహేష్ బాబును కూడా రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తున్న ఊహాగానాలు చూసి నవ్వొస్తోంది. వీటికి ఆధారం ఏమిటంటే తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణంనాయుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఆ రెండు ముక్కలే కావచ్చును.

“పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడాన్ని తెదేపా స్వాగతిస్తోంది. ఆయన కొన్ని స్థానాల నుంచే పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని విన్నాము. కనుక వచ్చే ఎన్నికలలో మా పార్టీతో పొత్తులు పెట్టుకొంటారని ఆశిస్తున్నాము,” అని అన్నారు.

అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ప్రకటన విని తెదేపా ఉలిక్కిపడిందంటూ మీడియాలో ఎవరి ఊహాశక్తిని, కల్పనాశక్తిని బట్టి రకరకాల కధనాలు వండి వార్చేస్తూ ప్రజల జి.కె.కి కూడా పదును పెడుతున్నారు.

గతంలో చిరంజీవి రాజకీయాలలోకి వస్తున్నప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఇలాగే తెగ హడావుడి పడిపోయాయి. నిజం చెప్పాలంటే నేడు పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానుల కంటే నాడు చిరంజీవికే ఎక్కువుండేవారు. అదీకాక చిరంజీవికి అండగా పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ తదితర మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ వచ్చి నిలబడ్డారు. అయినా ప్రజారాజ్యం ఏవిధంగా చతికిలపడిందో అందరూ చూసారు. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఒకరినొకరు డ్డీ కొంటామని స్పష్టం చేసారు కూడా.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ‘ఎన్నికలలో పోటీ ప్రకటన’ వరకు ఏ విషయంలోను రాజకీయ పరిణతి కనబరచలేకపోయారు. అందరికంటే ఎక్కువ పారితోషికం పొందుతున్నా తన వద్ద డబ్బులు లేవని పదేపదే చెపుతున్నారు…ఎందుకో? వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని చెపుతూనే మళ్ళీ నెలవారీ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకోవాలని, అందుకోసం మరికొన్ని సినిమాలు చేస్తానని ఆయనే చెప్పుకొన్నారు. ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయన ఆర్దికపరిస్థితి చక్కబడకపోతే మరో ఏడాదో రెండేళ్ళు మూడేళ్ళ తరువాతయినా ఆయన పరిస్థితి అలాగే ఉండవచ్చును. కనుక ఇప్పటి నుంచే ఆయన జనసేన పార్టీ నిర్మాణం చేపట్టే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. ఒకవేళ మొదలుపెట్టాలన్నా చేతిలో డబ్బులు లేవని ఆయనే చెపుతున్నారు కనుక అది సాధ్యం కాదని అర్ధమవుతోంది.

కనుక ఇదివరకులాగే మళ్ళీ ఎన్నికలకు ముందు రెండు మీటింగులు పెట్టిన తరువాత, ఏవో కారణాల చేత ఈసారి కూడా తెదేపా-బీజేపీ కూటమికి మద్దతు ఇస్తానని ప్రకటించవచ్చును లేదా తెదేపాతో భాజపా కటీఫ్ చేసుకొన్నట్లయితే భాజపాతో చేతులు కలపవచ్చును లేదా గాలి ముద్దు కృష్ణంనాయుడు చెపుతున్నట్లు ఓ ఐదారు స్థానాలలో సినీ పరిశ్రమలో తనకు అండగా నిలబడిన వారిని పోటీకి నిలపవచ్చును. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అన్ని స్థానాలలో నుంచి పోటీ చేసినా, తెదేపా,భాజపా, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని గెలవడం అసాధ్యం.

ఆంధ్రప్రదేశ్ లోనే ఇటువంటి పరిస్థితి కనబడుతుంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణా గురించి అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ధాటికి దేశముదురు తెదేపా, కాంగ్రెస్, భాజపాలే ఎదురునిలవలేకపోతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ ఎంత?

పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని, ఆయన నీతి నిజాయితీలు, మానవత్వం, వామపక్ష భావజాలం వగైరా చర్చను పక్కన పెట్టి వాస్తవిక దృక్పధంతో చూసినట్లయితే 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఏవిధంగా పాల్గొన్నా కూడా ఆయన వలన తెదేపా, భాజపా, వైకాపా, కాంగ్రెస్, తెరాస పార్టీలకు ఎటువంటి హానీ ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close