తెదేపా-బీజేపీల మధ్య సయోధ్య ఏర్పడుతుందా?

తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నపటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు పార్టీల నేతల మధ్య వివిధ కారణాలు, సమస్యల వలన కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం సాధ్యం కాదు కనుక తెదేపా మోడీ ప్రభుత్వం పట్ల వినయంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి తెదేపా అంత బలం లేదు కనుక తెదేపాతో సఖ్యతగా ఉండక తప్పడం లేదు. కానీ ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వంటి అనేక హామీలపై కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల తెదేపా ప్రభుత్వం, దాని నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అది పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉంది. అందుకే అపుడప్పుడు తెదేపా నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతూ మళ్ళీ దానిపైనే తెదేపా నేతలు విమర్శలు చేయడాన్ని సహించలేని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రతివిమర్శలు చేస్తుంటారు. తమ మధ్య ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతోందో వారందరికీ తెలుసు. కానీ కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించే సామర్ధ్యం ఇరుపార్టీల నేతలకి లేకపోవడంతో ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో వారిలో వారే కలహించుకొంటున్నారు. దాని వలన తమకే తీవ్ర నష్టం కలుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఎవరి లెక్కలు వారికుంటాయి కనుక యుద్ధం కంటిన్యూ చేయవలసి వస్తోంది.

కేంద్రప్రభుత్వం తన హామీలను నేరవేర్చుతుందో లేదో వారెకీ తెలియదు. అలాగని నిత్యం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటే రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు కాట్లాడుకొంటే మధ్యలో నక్క వచ్చి దానిని ఎత్తుకుపోయినట్లు, మధ్యలో మరో పార్టీకి రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం ఉందని కూడా రెండు పార్టీలకు తెలుసు. అందుకే తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకొని భవిష్య కార్యాచరణను నిర్ణయించుకొనేందుకు శనివారం రెండు పార్టీలకు చెందిన నేతలు విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన సమక్షంలోనే సమావేశామవబోతున్నారు.

ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కిమిడి కళావెంకట రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, తెదేపా ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, తెదేపాపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేత సోము వీర్రాజు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తదితరులు పాల్గొంటారు. ఈ సమావేశంలో తమా మధ్య భేదాభిప్రాయాలకు కారణమవుతున్న అన్ని అంశాల గురించి వారు దైర్యంగా చర్చించగలిగితే రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. అలాకాక ఈ సమావేశంలో కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొన్నట్లయితే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందన్నట్లు రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరులో జగన్ – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ క్రిస్టినా !

గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభ పెట్టి పాత క్యాసెట్ ను తిరగేస్తున్న సమయంలో .. గుంటూరు జడ్పీ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా వేమూరులో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటన్న చంద్రబాబు...

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close