వైకాపాకి శల్య సారధ్యం చేస్తూ మళ్ళీ తెదేపాను నిందించడం దేనికో?

నెల్లూరు ఎంపి మేకపాటి రాజా మోహన్ రెడ్డి మొన్న నెల్లూరులో జరిగిన ఒక సభలో జగన్ సమక్షంలోనే కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “2014 ఎన్నికలలో మా పార్టీ చేసిన చిన్న చిన్న తప్పుల వలననే తెదేపా అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికలు మా పార్టీకి అగ్ని పరీక్ష వంటివి. కనుక ఆ తప్పులను సరిదిద్దుకొని వచ్చే ఎన్నికలలో తప్పకుండా విజయం సాధిస్తాము. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పడేశారు. ఆ కారణంగా ప్రజలలో చంద్రబాబు నాయుడుపట్ల నమ్మకం సడలింది. దీనిని మనం ఒక అవకాశంగా మలచుకొని తెదేపా ప్రభుత్వం చేస్తున్న ఈ మోసం గురించి ప్రజలకు వివరించి, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. గత ఎన్నికలలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి,” అని అన్నారు.

మేకపాటి చెపుతున్న ఆ మాటలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి చేపుతున్నవేనని అర్ధమవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రయత్నాలు ఏమయినా చేశారా? చేస్తున్నారా? అంటే లేదనే జవాబు చెప్పవలసి ఉంటుంది.

2014 సార్ర్వత్రిక ఎన్నికలలో తెదేపా చేతిలో వైకాపా ఓడిపోయిన తరువాత, “తెదేపా ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచిందని, తాము నీతి నిజాయితీకి కట్టుబడి ఆవిధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఇష్టపడక పోవడం వలననే ఓడిపోయామని,  ఆ ఎన్నికలలో తాము తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ‘అతివిశ్వాసం’ ప్రదర్శించడం వలననే ఓడిపోయామని, చాలా స్వల్ప ఓట్ల తేడాతో తెదేపా గెలిచిందని…ఇలా తమ ఓటమికి, తెదేపా గెలుపుకి అనేక కారణాలు   జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పుకొని బాధపడేవారు. ఆయన చెప్పిన కారణాలు సహేతుకమయినవే అయినా ఎన్నికల కురుక్షేత్రంలో రాజకీయ పార్టీలు డ్డీ కొంటునప్పుడు ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో వారే అంతిమంగా గెలుస్తుంటారు కనుక ఆ విషయంలో జగన్ విఫలమయ్యాడని చెప్పక తప్పదు.

అయితే కర్ణుడి చావుకి వెయ్యి కారణాలున్నట్లే, ఆ ఎన్నికలలో వైకాపా ఓటమికి, తెదేపా గెలుపుకి ఇంకా అనేక కారణాలున్నాయని అందరికీ తెలుసు. సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని, జరిగిన పొరపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకొనే ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ తంతుని ‘మమ’ అనిపించేసి, ఆ మరునాటి నుంచి, తనను ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుపడినందుకు చంద్రబాబు నాయుడుపై జగన్ యుద్ధం ప్రకటించేశారు. నాటి నుండి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే వైకాపా పాలసీ అన్నట్లుగా సాగిపోతున్నారు తప్ప కనీసం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకొనే ప్రయత్నాలు చేయడం లేదు.

పార్టీలో సీనియర్లతో సలహా, సంప్రదింపులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి వరుసగా చేస్తున్న తప్పుల వలన, ఆయన స్వయంగా తెదేపా చేతిలో పదేపదే భంగపడటమే కాకుండా తన పార్టీ నేతలకు కూడా అవమానకర పరిస్థితులను నిత్యం ఎదుర్కోవలసి వస్తోంది. నిజానికి తెదేపా ప్రభుత్వం చేస్తున్న అనేక తప్పులను ఆయన బయటపెట్టి చాలా సమర్ధంగా నిలదీస్తున్నారనే చెప్పవచ్చును. కానీ చంద్రబాబు నాయుడుపై పగతో రగిలిపోతున్న కారణంగా, ఆ ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తెదేపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిన చోట తనే దోషిగా నిలబడుతున్నారు. నేటికీ ఆ విషయం ఆయన ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే పార్టీలో సీనియర్ల సలహా, సంప్రదింపులు చేయనందునేనని భావించవచ్చును.

మరి  ఇప్పుడే ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి శల్యసారద్యం చేస్తున్నప్పుడు ఇంకా ఎన్నికలలో విజయం సాధించిపెట్టగలరా? అంటే అనుమానమే. వైకాపాకి జగన్మోహన్ రెడ్డే ప్రధాన సైన్యాధిపతి…ప్రధాన శత్రువు కూడా. కనుక ఆయనలోని ఆ అంతర్గత శత్రువుని వదిలించుకోనంత వరకు వైకాపా విజయం సాధించడం కష్టమేనని చెప్పక తప్పదు.

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close