టీడీపీ @ 41 : పొలిటికల్ ఫీనిక్స్ !

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఓ ప్రాంతీయ పార్టీ ఇంత కాలం మనగలగడమే అద్భుతం . అందులో టీడీపీ పయనం మరింత ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొని ఎప్పటికప్పుడు తట్టుకుని … ఫీనిక్స్ పక్షిలా మళ్లీ అగ్రస్థానానికి ఎదుగుతుంది. 2019 ఎన్నికల తర్వాత చాలా మంది టీడీపీ నేతలే… ఇక పార్టీ ఉంటుందా అన్న ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంత ధీమాగా ఉన్నారు. ఈ 41వ ఆవిర్భావం టీడీపీలో కొత్త జోష్‌తో జరుగుతోంది. సెమీస్‌లో గెలిచిన ఉత్సాహం… ప్రజల్లో కనిపిస్తున్న మార్పు మరోసారి టీడీపీ చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం కలిగించేలా చేస్తోంది.

ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఓ ప్రాంతీయ పార్టీ వరుసగా రెండు సార్లు ఓడిపోతే ఇక ఆ పార్టీ చరిత్రలో కలిసిపోవడమే. ఇప్పటికే ఎన్నో పార్టీలు అలా కలిసిపోయాయి. కానీ టీడీపీ మాత్రం వరుసగా రెండు సార్లు ఓడినా అత్యంత ఘోర పరాజయాలు చవి చూసినా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తూనే ఉంది. 2019లో ఎదురైనా పరాజయంతో ఇక టీడీపీ కోలుకుంటుందా అనే పొజిషన్ నుంచి మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో తామే హాట్ ఫేవరేట్లమని ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో నిరూపించుకుంది. లోకేష్ పాదయాత్రకు స్పందన… చూసి టీడీపీ శ్రేణుల్లో మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ ఎదుర్కోని సంక్షోభం అంటూ లేదు. తొలి సారి పార్టీ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. నాదెండ్ భాస్కర్ రావు దెబ్బకు అధికారం కోల్పోయినంత పనైంది. అయితే అదే పునాదిగా ఎదిగింది. తర్వాత ఎన్నికల్లో ఓటములు వచ్చాయి. అత్యంత ఘోరమైన ఓటములు వచ్చాయి. తాను పెట్టిన పార్టీ తనతోనే అంతమవుతుందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు కానీ.. టీడీపీ ఇప్పటికీ గట్టిగా నిలబడి పోరాడుతూనే మధ్యలో టీడీపీ పదేళ్లు అధికారానికి దూరమయింది.

ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దీంతో ఏపీకే పరిమితవ్వాల్సిన పరిస్థితి. తర్వాత ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్నా 2019లో దారుణ పరాజయం. నాలుగేళ్లు అష్టకష్టాలు పడి ఇప్పుడు మళ్లీ పార్టీ గాడిలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల తర్వాత ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. తెలంగాణలోనూ కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి తీసుకు వస్తే… ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఆ పార్టీది సువర్ణ అధ్యాయమే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close