పోలవరం బాధ్యత కేంద్రం తీసుకోవాలంటున్న టీడీపీ..!

పోలవరం ప్రాజెక్ట్ పై తెలుగుదశం పార్టీ తన విధానం మార్చుకుంది. ఇప్పుడా ప్రాజెక్టును.. కేంద్రమే చేపట్టాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకు వచ్చింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ మేరకు టీడీపీ విధానాన్ని అధికారికం గా ప్రకటించారు. తక్షణం.. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును స్వాధీనం చేసుకుని శరవేగంగా పూర్తి చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నిజానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు… దీనికి పూర్తి భిన్నమైన వాదనను వినిపించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని అసలు రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తిమీద వేసుకోవడం ఎందుకున్న వాదనను.. అప్పట్లో విపక్షాలు వినిపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే… ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల కోసం… ఏపీ సర్కార్… ప్రాజెక్టు నిర్మాణాన్ని తీసుకుందని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని.. ఇష్టం వచ్చినట్లుగా.. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి… పనులు చేయిస్తున్నారని… వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

అప్పుడు.. టీడీపీ సర్కార్.. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికే తాము.. పోలవరం బాధ్యతలు తీసుకున్నామని… కేంద్రం చేతుల్లో ఉంటే.. దశాబ్దాలు అయినా పూర్తి కాదనే వాదన వినిపించారు. పైగా తమకు… నీతిఆయోగే.. పనులు అప్పగించిందని స్పష్టం చేశారు. ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రివర్స్ టెండర్లు పిలిచినా.. గడువులోగా పూర్తి చేస్తామని వాదిస్తోంది. అయినప్పటికీ.. తెలుగుదేశం నేతలు మాత్రం… పోలవరం ప్రాజెక్టును కేంద్రం పరిధిలోకి తీసుకోవాలనే డిమాండ్లు ప్రారంభించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రం ఆ ప్రాజెక్టును చేపడితే. ఆలస్యం అవుతుందంటున్న టీడీపీ.. ఇప్పుడు… అదే ప్రాజెక్టును కేంద్రం తీసుకుంటే.. ఎందుకు ఆలస్యం కాదో… వివరణ ఇవ్వాల్సి ఉంది.

ఏపీ సర్కార్… పోలవరం ప్రాజెక్టు విషయంలో సీరియస్ గా ఉన్నామని… 2021కల్లా పూర్తి చేసి.. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభింపచేస్తామని… జలవనరుల మంత్రి చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో.. ప్రాజెక్టుపై న్యాయవివాదాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూండటంతో… అడ్డంకులు వస్తాయేమోనన్న ఆందోళన మాత్రం ప్రజల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close