స‌ర్దార్‌పై టీడీపీ ఎఫెక్ట్‌

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ తొలిరోజు ప్ర‌భంజ‌నం సృష్టించింది. టాక్ ఎలాగున్నా స‌రే.. ఆ వ‌సూళ్లు చూసి ముచ్చ‌ట ప‌డిపోతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌. చాలా ఏరియాల్లో తొలిరోజు వ‌సూళ్లు బాహుబ‌లి వ‌సూళ్ల‌కంటే మిన్న‌గా ఉన్నాయి. క‌నీసం ప‌ది ల‌క్ష‌ల మార్జిన్‌లో బాహుబ‌లి వ‌సూళ్లు క్రాస్ చేసి రికార్డు సృష్టించింది స‌ర్దార్‌. అయితే ఆ ఎఫెక్ట్ వెనుక‌… ఈ ప్ర‌భంజ‌నం వెనుక టీడీపీ స‌ర్కార్ మ‌ద్ద‌తున్న‌ట్టు క్లియ‌ర్ క‌ట్‌గా అర్థ‌మ‌వుతోంది.

ఏపీలో సర్దార్‌కి కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరికాయి. బెనిఫిట్ షోల కోసం ఎన్ని థియేట‌ర్లు అడిగితే అన్నిచ్చారు. సాధార‌ణంగా బెనిఫిట్ షో అన‌గానే కొన్ని థియేట‌ర్ల‌కే ప‌రిమితం చేస్తారు. కానీ స‌ర్దార్‌కి ఆ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా తెల‌గుదేశం ప‌ట్టుబాగా ఉన్న విజ‌య‌వాడ‌, గుంటూరు త‌దిత‌ర ప్రాంతాల్లో స‌ర్దార్ ప్ర‌భంజ‌నం ఏ రేంజులో సాగింది. క‌నిపించిన ప్ర‌తీ థియేట‌ర్‌లోనూ బెనిఫిట్ షో ప‌డిపోయింది. టికెట్ రూ.1000 ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కొన్ని థియేట‌ర్లో రూ.3000 లకు కూడా అమ్మేశారు. ఎక్క‌డా పోలీసులు అబ్జెక్ష‌న్ చెప్ప‌లేదు. తెలంగాణ‌లో కూడా స‌ర్దార్‌కు స్పీడు బ్రేక‌ర్లు వేయ‌డానికి ఎవ్వ‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపి స‌పోర్ట్ చేసి, అధికార ప‌గ్గాలు అందివ్వ‌డంలో కీల‌క భూమిక పోషించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కి టీడీపీ ఈ ర‌క‌మైన మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close