సోషల్ మీడియా వార్ కి టీడీపీ సిద్ధ‌మౌతోందా..?

తెలుగుదేశం పార్టీ మీదా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మీదా, మంత్రి నారా లోకేష్ మీదా సోష‌ల్ మీడియాలో పంచ్ లూ, కౌంట‌ర్లూ ఎక్కువైన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, వీటిపై చ‌ర్య‌లకు స‌ర్కారు దిగ‌డం కూడా చూస్తున్నాం. నారా లోకేష్ మంత్రి అయిన త‌రువాత‌, ఆయ‌న మాట జారిన సంద‌ర్భాలూ వ్యాఖ్యానాల‌పై ఫోక‌స్ ఎక్కువైంది! అయితే, ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ త‌న సోష‌ల్ మీడియా టీమ్ ను మ‌రింత ప‌టిష్ట ప‌ర‌చేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. దాని కోసం ప్ర‌త్యేకంగా కొంత బ‌డ్జెట్ ను కూడా కేటాయించింద‌ని తెలుస్తోంది.

నిజానికి, 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీ సోష‌ల్ మీడియా టీమ్ చాలా ప‌టిష్టంగా ఉండేది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ఒక ఐటీ వింగ్ పార్టీ కోసం అహ‌ర్నిశ‌లూ ప‌నిచేసింది. ముఖ్య‌మంత్రి నారా లోకేష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వైకాపాపై సోష‌ల్ మీడియా వార్ బాగానే సాగించారు. ఎన్నిక‌ల త‌రువాత సోష‌ల్ మీడియాను టీడీపీ కాస్త లైట్ తీసుకుంది. ఈ మ‌ధ్య వైకాపాకు మ‌ద్ద‌తుగా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వీట‌న్నింటినీ ధీటుగా త‌ట్టుకునేందుకు నెల‌కు రూ. 50 నుంచి 60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేసేందుకు టీడీపీ సిద్ధ‌మైంద‌ని ఆ పార్టీకి చెందిన ఒక నాయ‌కుడు ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే, ఈ రేంజి బ‌డ్జెట్ పెట్ట‌డం ఇప్పుడు అవ‌స‌ర‌మా అనే చ‌ర్చ కూడా టీడీపీలో మ‌రికొంత‌మంది నేత‌లు వినిపిస్తున్నార‌ట‌! అధికార ప‌క్షాన్ని ప్ర‌శ్నించేందుకు ప్ర‌తిప‌క్షం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్ర‌భుత్వంలో వ్య‌తిరేక‌త‌ను ఎత్తిచూపే అవ‌కాశం వారికే ఎక్కువ క‌దా. ఇక‌, వైకాపాపై విమ‌ర్శ‌లు చేయాలంటే టీడీపీ ద‌గ్గరున్న కంటెంట్‌.. జ‌గ‌న్ అవినీతి, అక్ర‌మాస్తులు! వీటిపై సోష‌ల్ మీడియాలో వార్ మొద‌లుపెడితే ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌లు క‌నెక్ట్ అవుతారా లేదా అనే అనుమానం పార్టీలోనే కొంత‌మంది నేత‌లు వ్య‌క్తం చేస్తున్నార‌ట‌! ఎందుకంటే, జగ‌న్ కేసులపై విమ‌ర్శ‌లు అనేది రొటీన్ అయిపోయింది. విమ‌ర్శించేందుకు కొత్త‌గా అంటూ ఏమీ మిగ‌ల్లేదు. కాబ‌ట్టి, అదే పాత ప్ర‌చారాన్ని మ‌రోసారి సోష‌ల్ మీడియాలోకి తెస్తే వ‌ర్కౌట్ అవుతుందా అనే చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంద‌ట‌.

సో.. కంటెంట్ ఏదైనాస‌రే, టీడీపీ కూడా సోష‌ల్ మీడియా వార్ కి సిద్ధ‌మౌతోంద‌న్న‌ది దాదాపు క‌న్ఫ‌ర్మ్‌. ఈసారి కూడా ముఖ్య‌మంత్రి త‌న‌యుడు లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే మ‌ళ్లీ ఎటాక్ స్టార్ట్ కాబోతోంది. ఏదేమైనా, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సామాజిక మాధ్య‌మాల్లో మితిమీరిన ఆరోప‌ణ‌లూ, శృతి మించిన వ్యాఖ్యానాలూ, వాదోప‌వాదాలూ ఈ ర‌చ్చ తార‌స్థాయిలో ఉంటుంది అన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close