అమరావతి ప్రహసనం- ఆపరేషన్‌ రివర్స్‌గేర్‌

Telakapalli-Raviఅమరావతిని అపురూప రాజధానిగా నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నిజంగా అమలుకు వస్తాయా? ఈ సందేహం ప్రజలకూ ప్రతిపక్షాలకే కాదు- ఆయనతో ఉన్న వారికి కూడా కలుగుతున్నది. గొప్ప ప్రచారంతో మొదలైన రాజధాని నిర్మాణం అడుగడుగునా అయోమయానికి దారితీస్తున్నది. అవగాహనా సదస్సులు రైతుల ఆగ్రహావేశాలతో రసాభాసగా మారుతున్నా సమాధానం చెప్పడానికి అధికారులకూ అధినేతలకే అంత అవగాహన ఉండటం లేదు. ఏదో చెప్పినా నమ్మడానికి రైతులు అసలే సిద్ధంగా లేరు. చాలా అంశాల్లో వారికి ఏదో గోల్‌మాల్‌ జరిగిపోతుందనే అనుమానాలు రోజురోజుకు ప్రబలుతున్నాయి. అందుకు చాలా కారణాలు:

1.ఈ ప్రాంతంలో అభివృద్ది ఫలాలు ఇక్కడి రైతులకే చెందాలి అన్నది ముఖ్యమంత్రి మాట. కాని ఇప్పుడు మాష్టర్‌ ప్లాన్‌ ప్రకారం వారికి కోర్‌ కాపిటల్‌లో గాని, ప్రైమ్‌ కమర్షియల్‌లో గాని ప్లాట్లు వచ్చే అవకాశం వుండదు. బహుశా ఏ ఫోర్త్‌ క్లాస్‌ ప్లేసులో దక్కుతాయి. అది కూడా ఎప్పుడో..ఎవరికి…ఎక్కడో…చెప్పే నాథుడు లేడు

2.తీసుకున్న స్థలాలకు దగ్గరలోనే ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామన్నది అప్పటి వాగ్దానం. 2015 ఏప్రిల్‌ 17న వెలువడిన జివో 84 ఆ మేరకు హామీ నిస్తున్నది కూడా. అయితే లాటరీ ప్రకారం నిర్ణయమన్నది ఇప్పుడు వివరణ. వీలైనంత వరకూ దగ్గరగా ఇప్పుడు అని సన్నాయి నొక్కులు. ఇదంతా మే నెలకు గాని పూర్తి కాదని అధికారిక వివరణ సారాంశం.

3. రాజధాని నిర్మాణం కోసం గ్రామాల నిర్మూలన జరగదు. గ్రామ కంఠాలకు రక్షణ ఉంటుంది అన్నది అప్పటి మాట. ఎక్కడ రోడ్లు వస్తాయో తెలియదు. వాటిని బట్టి చూస్తాం అన్నది ఇప్పటి మాట

4. ఠంచనుగా పరిహారం అన్నది వాగ్దానం. వచ్చిన వారికి వచ్చినప్పుడు వచ్చిన మేరకు అన్నది ఆచరణ.

5.అక్కడి వారికి అక్కడ ఉపాధి కల్పన అన్నది అప్పటి మాట. మామూలుగా చెప్పే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ మాత్రమే ఇప్పటి పాట.

6.
రాజధానితో విజయవాడ నుంచి నరసరావు పేట వరకూ ధరలు అలా పెరిగిపోతాయన్నది అప్పటి ఊరింపు. చుట్టుపక్కల కృష్ణా గుంటూరు జిల్లాలలో విస్తార ప్రాంతాలను సేద్య క్షేత్రాలుగానే ఉంచాలనీ అంటే, ఎలాటి వాణిజ్య, ఇళ్ల స్థలాల వెంచర్లు అనుమతించబోమని ఇప్పటి ఉత్తర్వులు!

7. మూడు పంటలు పండే పొలాలను నయానోభయానో సమీకరించి మామూలు పొలాలను మాత్రం వ్యవసాయానికే పరిమితం చేసుకోవాలని శాసించడం ఎక్కడి ప్రజాస్వామ్యం? ఏ విధమైన విజ్ఞానశాస్త్రం?

8. రాజధాని నిర్మాణాలకు అవసరమైన మేరకు అవసరమైనప్పుడే భూములు తీసుకోవాలన్నది అప్పటి విధానం. అసలు పూర్తిగా చట్టబద్దమైన ప్రక్రియలు పూర్తికాకపోయినా స్వాధీనం చేసుకునేలా 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలన్నది ఇప్పటి ఆలోచన.

ఇంతకూ కర్తలెవరు?

ఇవన్నీ ఒక ఎత్తుకాగా అసలు రాజధాని నిర్మాణ కర్తలెవరనేది ఇంకా తేలని ప్రశ్నగానే ఉంది. ప్రభుత్వ దృష్టిలో ఎవరైనా ఉండొచ్చు గాని అందుకు అనుసరించే విధానం పారదర్శకంగా ఉండటం లేదు. సింగపూర్‌ ప్రభుత్వం గాని దానికి సంబంధించిన అధికార సంస్థలు గాని ఆసక్తి చూపడం లేదు గనక ఏవో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే సూచనలున్నాయి. అప్పుడవి తమ సబ్‌ కాంట్రాక్టర్లుగా ఇక్కడి వారినే అంటే సర్కారీ సన్నిహితులనే ఎంచుకోవచ్చు. వారికి ఎలాటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం 99 సంవత్సరాల లీజు క్లాజు చేర్చుతున్నారు. ఇక్కడ భూమి రేట్లు అనుకున్న ప్రకారం పెరగలేదు గనక మిగిలిన చోట్ల లావాదేవీలు బిగిస్తే అనివార్యంగా అమరావతి పరిసరాలకే రాక తప్పదనే వ్యూహం ప్రభుత్వం అనుసరిస్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏమైనా ఏడాది కిందట ఇచ్చిన పంచరంగుల చిత్రానికి ప్రస్తుత గజిబిజి ప్రహసనానికి ఏ పొంతనా లేదు గనకే రైతులు తిరగబడుతున్నారు. వారి ఆగ్రహం ఉద్యమ రూపం తీసుకోకుండా అనేక ఆంక్షలను అమలు జరిపి సభలూ సమావేశాలను అడ్డుకుంటున్నారు.ఈ ఉద్రిక్తత పెరిగేదే గాని తగ్గేలా కనిపించడం లేదు. ఇదీ ఆపరేషన్‌ రివర్స్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close