బీసీ నాయకత్వం చేతుల్లోకి టీడీపీ..!

బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీలకు 60 శాతానికిపైగా పదవులు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ కమిటీని అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గతంలోనే అచ్చెన్నాయుడును ప్రకటించారు. అచ్చెన్నాయుడుతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. కార్యవర్గానికి ఓ రూపు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వానికి భయపడకుండా పోరాడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. యువతకు ఎక్కువ పదవులు లభించాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల్ని నియమించారు.  ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేకపోయినా చురుకుగా ఉంటున్న  పలువురికి పదవులు ఇచ్చారు. 

కమిటీలో ఉన్న వారి సగటు వయస్సు 48 ఏళ్ళు మాత్రమే. మొత్తం 219 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. 18 మంది ఉపాధ్యక్షులు.. 16 మంది ప్రధాన కార్యదర్శులు , 18 అధికార ప్రతినిధులు ఉన్నారు. జాతీయ కమిటీల్లో చోటు దక్కని వారందరికీ ఇక్కడ అవకాశం కల్పించారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించే వారిలో ప్రధాన కార్యదర్శులు ఎక్కువగా ఉంటారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వారికి చోటు కల్పించారు. 

బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో.. అగ్ర కులాలకు ఈ సారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. టీడీపీకి దన్నుగా ఉంటుందనుకున్న సామాజికవర్గం కన్నా.. బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీసీ కావడంతో.. టీడీపీ నాయకత్వం బీసీల చేతుల్లోకి వెళ్తుందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ముందు టీడీపీ కార్యక్రమాల్లో బీసీ నేతలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close