రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఆషామాషీగా నేతల వరకూ స్టేజ్ వేసుకుని అందర్నీ తోలుకొచ్చి .. తమ మాటలు వినిపించి పంపేయడం సభా నిర్వహణ కాదు. ఒక్క రోజు సమావేశం నిర్వహించడానికే చాలా పార్టీలు కిందా మీదా పడుతూంటాయి. ప్లీనరీల్లో భోజనాల కోసం తోసుకోవడం.. కిట్లను దోపిడీ చేయడం.. వంటివి జరిగిపోతూంటాయి. కానీ టీడీపీ నిర్వహించే మహానాడులో ఎప్పుడూ అలాంటి ఘటనలు కనిపించవు.
ఓ పార్టీ.. రాష్ట్రం మొత్తం పార్టీ క్రియాశీలక కార్యకర్తలను ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఓ సవాలే. కానీ ఇలాంటి సవాళ్లను టీడీపీ నాయకత్వం అలవోకగా ఎదుర్కొంటోంది. కడపలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు దీనికి సాక్ష్యం. పక్కా ఏర్పాట్లతో వేల మంది వచ్చిన క్రియాశీలక కార్యకర్తలకు చిన్న అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. ఏ విషయంలోనూ వారు ఇబ్బందిపడాల్సిన సందర్భం లేదు. ఇదే తరహాలో మూడు రోజుల పాటు నిర్వహించడం.. చివరిగా బహిరంగసభ ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి చాలా కసరత్తు అవసరం. అదంతా ఓ ఐక్యతతో టీడీపీ ప్రభుత్వం చేసేస్తుంది.
మహానాడు లాంటివి నిర్వహించడం టీడీపీకి అలవాటే. రాజకీయ సభలను. చిన్నతప్పు లేకుండా నిర్వహించడానికి, వచ్చే నేతలకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ప్లానింగ్ ప్రస్తుత రాజకీయ పార్టీల్లో ఉండటం అరుదు. పార్టీ నిర్వహణ, పాలనతో సహా ఇలాంటి పకడ్బందీ వ్యూహాలతో టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజలను అబ్బురపరుస్తోంది.