ఎదురుదాడికి దిగిన తెలుగుదేశం

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ నేతలు ప్రభుత్వంపై ఇంతకాలంగా ఎన్ని విమర్శలు చేసినా మాట్లాడని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. విజయవాడ తెలుగుదేశం విజయవాడ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకన్న ఎదురుదాడికి చంద్రబాబు ఆమోదం ఉందో, లేదో ఇంకా తెలియటంలేదు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కొంతకాలంగా టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్నకూడా కన్నా, కావూరి, సోము వీర్రాజు అనంతపురంలో పర్యటిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బలహీనపడిపోయిందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శలు చేశారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. దీనిపై ఇవాళ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు భిక్ష అని, ఆయన మంత్రిపదవికోసమే ఈ విమర్శలు చేస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పారు. పురందేశ్వరి ఎన్‌టీఆర్ కుమార్తె అని చెప్పుకోటానికి తాము సిగ్గుపడుతున్నామని అన్నారు. వారాలు చేసుకుని బతికిన కావూరి వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ సున్నా లక్ష్మీనారాయణ అయిపోయారని అన్నారు. కావూరి, కన్నా, పురందేశ్వరి సోనియా గాంధి ఏజెంట్‌లని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలు వీరిపై దృష్టి పెట్టాలని అన్నారు. చంద్రబాబు చరిష్మావల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బాబుకు మచ్చ తెచ్చేలా మాట్లాడితో సహించబోమని వెంకన్న హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులు కొట్టారని RRR ఫిర్యాదు, పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ...

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close