తెరాసతో తెదేపా నేతలు కుస్తీ…బాలకృష్ణ చట్టాపట్టాల్

ఈనెల 27,28 తేదీలలో అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలు జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. ఆయనే స్వయంగా అనేక మంది ప్రముఖులను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రాలు అందిస్తున్నారు.

ఈరోజు ఆయన సచివాలయంలోని తెలంగాణా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ కార్యాలయానికి వెళ్లి ఈ ఉత్సవాలకు రావలసిందిగా కార్డు ఇచ్చి ఆహ్వానించారు. అందుకు ఆయన చాలా సంతోషించి తప్పకుండా వస్తానని చెప్పారు. తనతో బాటు తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా వస్తారని అయన తెలిపారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఒక్కటే. అందుకే తెలంగాణా మంత్రులను ఆహ్వానిస్తున్నాము. తెలంగాణా వారినే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల మంత్రులను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నాము,” అని తెలిపారు.

ఇరు రాష్ట్రాల మధ్య ఇటువంటి సంహృద్భావ వాతావరణం నెలకొని ఉండటం చాలా హర్షించి దగ్గదే. అయితే బాలకృష్ణ ఆ మంత్రిని కలవడానికి కొన్ని గంటలు ముందే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుత్బుల్లాపూర్ తెదేపా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కి తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ , సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం పెట్టి మరీ ముఖ్యమంత్రిని తిట్టి పోశారు. తెలంగాణాలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఒక మానసిక రోగిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తిట్టి పోశారు. వారి తిట్ల దండకం పూర్తయిన కొన్ని గంటలకే బాలకృష్ణ వెళ్లి తెరాస మంత్రిని ఆహ్వానించి, ఆయనతో కాసేపు కబుర్లు కూడా చెప్పి వచ్చారు.

ఒకపక్క తెరాస వలన తమ పార్టీ తెలంగాణాలో తుడిచిపెట్టుకొనిపోతుంటే, బాలకృష్ణ వెళ్లి తెరాస నేతలతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకొంటూ వారితో ఫోటోలు దిగుతుంటే తెలంగాణా తెదేపా నేతలకి జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. తెదేపా పట్ల, దాని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెరాస నేతలకి చాలా స్పష్టత ఉంది. కానీ తెరాసతో ఏవిధంగా వ్యహరించాలనే విషయంపై తెదేపా నేతలలో స్పష్టత లేదని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త పాలసీ : ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి రాచబాట..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తోంది. పరిశ్రమలు పెట్టాలనుకునేవారి... అనేకానేక ప్రోత్సాహకాలతో కొత్త పాలసీ ప్రవేస పెట్టింది. భారీగా పెట్టుబడులు పెట్టే వారికి భారీ రాయితీలు ఇవ్నున్నారు. వచ్చే మూడేళ్ల...

” ఈశ్వరయ్య టేపు ” తీగ లాగితే మొద్దు శీను హత్య వరకూ వెళ్తోందేంటి..?

మొద్దు శీనును జైలు బయట హత్య చేసి ఓం ప్రకాష్ ఉన్న బ్యారక్ లోపల వేశారా..? . అవుననే అంటున్నారు.. అప్పట్లో... మొద్దు శీను హత్యకు గురైన సమయంలో న్యాయమూర్తిగా ఉన్న రామకృష్ణ....

అత‌డు వ‌చ్చి.. ప‌దిహేనేళ్లు!

అత‌డు.. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ స‌త్తా చెప్పిన చిత్ర‌మ్‌. మ‌హేష్ స్టైలీష్ న‌ట‌న‌ని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంత‌లు తొక్కించిన సినిమా. ఇప్ప‌టికీ.. ఆ సినిమా గురించి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానులు...

చిరు చేప‌ల ఫ్రై.. సూప‌ర్ హిట్టు

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ మ‌రింత యాక్టీవ్ గా క‌నిపిస్తున్నారు చిరంజీవి. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రుస్తూ చిరు కొన్ని వీడియోలు చేశారు. పోలీసుల పిలుపు మేర‌కు ప్లాస్మా డొనేష‌న్ క్యాంపులో పాల్గొని.. వాళ్ల‌ని ఉత్సాహ...

HOT NEWS

[X] Close
[X] Close