అమిత్ షా నుంచి టీడీపీ ఎంపీలకు “ఆశించిన” భరోసా లభించిందా..!?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వ్యతిరేక నేతలందరికీ హోంమంత్రి అమిత్ షా ఒకే సారి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఎంత కాలం నుంచి అడుగుతున్నారో కానీ.. టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వారంతా.. ఇచ్చిన సమయానికి తాము చెప్పాల్సిన.. చేయాల్సిన ఫిర్యాదులన్నీ రాసుకెళ్లి ఇచ్చి వచ్చారు. లోపలికి ఇంకేమైనా మాట్లాడారో లేదో కానీ.. బయట మాత్రం.. ఏపీలో దిగజారిపోతున్న శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లుగా చెప్పుకొచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి.. న్యాయస్థానాలపై దూషణలు, మండలిరద్దు అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని ఎంపీలు చెప్పుకొచ్చారు. అచ్చెన్న, పట్టాభిపై వైసీపీ దాడులు.. ఆలయాలపై దాడులు, మత మార్పిడులు అంశాలను ఆధారాలతో వివరించామన్నారు.

రాష్ట్ర పరిస్థితులపై అమిత్‌షాకు నివేదిక ఇచ్చామని.. ఇంకా ఆధారాలు ఉంటే పంపించాలని కోరారన్నారు. అన్నింటిపై త్వరలో సమీక్షిస్తామని హామీ ఇచ్చారని టీడీపీ ఎంపీలు సంతోషంగా చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన ప్రతిపక్షనేతలు, మీడియాపై కేసులు పెడుతున్నారని చెప్పినప్పుడు.. ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హామీ ఇచ్చినట్లుగా టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. టీడీపీ ఎంపీల బేటీ ముగియగానే… వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. అమిత్ షా సమయం ఇచ్చారు. ఆయన కూడా.. ఏీపలో పరిస్థితులు రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేశారు.

గత ఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీతో మళ్లీ సంబంధాలు పెంచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అందు కోసమే బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కేంద్ర నిర్ణయాలనూ సమర్ధిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే తమకు కేంమద్రం వైపు నుంచి ఒత్తిడి లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే వేధిస్తోందని నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని నమ్ముతున్న టీడీపీ నేతలు… బీజేపీతో మరింత దగ్గరై వైసీపీపై పోరాటానికి నైతిక మద్దతు పొందాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బయటకు వచ్చి కాన్ఫిడెంట్‌గా అమిత్ షా భరోసా గురించి చెప్పారు కానీ.. లోపల ఎంత వరకూ వారికి భరోసా లభించిందో మాత్రం క్లారిటీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close