మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేసింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు.

పేదలను ధనవంతులు చేయడం కాన్సెప్ట్ తో.. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని టీడీపీ ప్రకటించింది. రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రకటించారు ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. రెండోది బీసీలకు రక్షణ చట్టం. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది.

టీడీపీ ఇచ్చిన మూడో గ్యారంటీ “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు. నాలుగో పథకం.. అన్న దాత ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఐదోది మహిళ ‘మహా’ శక్తి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు.

ఆరో స్కీమ్ కింద యువగళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుందని… ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని తెలిపింది.

టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన గ్యారంటీ విధానాన్ని ఈ సారి టీడీపీ తీసుకుందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close