PEN : అసలే బొటాబొటి – ఆపై శత్రువు కుటిలనీతి, పసుపు కుంకుమలే బాబుకి రక్ష ?

అభివృద్ధి, సంక్షేమం, ఆంధ్రుల ఆత్మగౌరవం – ఈ మూడు అంశాలమీదే ఓటర్ల దృష్టి కేంద్రీకృతమై వుండేలా చంద్రబాబు నాయుడు – తెలుగుదేశం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రత్యక్షంగా తలపడుతున్న వైఎస్ జగన్మోహనరెడ్డితో, పరోక్షంగా తలపడుతున్న కెసిఆర్ తో, ప్రచ్ఛన్నంగా తలపడుతున్న నరేంద్రమోదీతో ఏకకాలంలో ఎన్నికల యుద్ధం చేయవలసిన పరిస్ధితిలో చంద్రబాబు చిక్కుకున్నారు. ప్రత్యేక హోదా తో మొదలై ప్రత్యేక పాకేజి వద్ద చాలాకాలం ఆగి, యు టర్న్ తీసుకున్న ‘ప్రత్యేక హోదా’ ఎన్నికల నినాదాల్లో ఎక్కడా వినిపించడమే లేదు.

వ్యక్తిగత మర్యాదలు మీరి పరస్పరం విమర్శించుకుంటున్న చంద్రబాబు, జగన్ ప్రత్యేకహోదా నినాదాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టేశారు. ఈవిషయం బాబు ప్రస్తావిస్తే బిజెపితో తెలుగుదేశం ప్రేమ, పెళ్ళి, విడాకుల ఘట్టాల్లో పిల్లిమొగ్గలు ప్రజలకు గుర్తువస్తాయి. బిజెపితో వున్న అప్రకటిత మైత్రీబంధం వల్లా, కరకునోటి కెసిఆర్ వత్తాసువల్లా జగన్ ప్రత్యేకహోదా అంశాన్ని ఎప్పటికీ ప్రస్తావించలేరు.

ఈవిధంగా “ప్రత్యేకహోదా” ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎజెండానుంచి మాయమైపోయింది.

తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే గత ఎన్నికలలో జగన్ 44.12 శాతం ఓట్లతో 65 సీట్లు సాధించారు. గెలుపొందిన తెలుగుదేశం పార్టీ 101 శాసనసభా స్ధానాలు వచ్చినా ఓట్ల శాతం 44.45 శాతం మాత్రమే! అప్పట్లో తెలుగుదేశానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్దతు వున్న విషయం ఈసందర్భంలో గుర్తుంచుకోవాలి.

ఇపుడు జనసేన శతృపక్షమైపోయింది. గత ఎన్నికలలో ఓడిపోయిన విషయాన్ని ఇప్పటికీ అంగీకరించనంత కసి ద్వేషాలతో బాబు పై రగిలిపోతున్న జగన్ కు దాయాది రాష్ట్ర పాలకుడు కెసిఅర్ అండ దొరికింది.

ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబుకు మద్దతుగా వుండగలరనుకున్న సంపన్నులు, సెలెబ్రిటీలు ఆకస్మికంగా జగన్ పార్టీ అభ్యర్ధులుగానో, ప్రచార కర్తలుగానో మారిపోవడం ఒక షాకింగ్ పరిణామం. మరో 5 ఏళ్ళపాటు అధికారంలో వుండే కెసిఆర్ కనుసన్నల్లోని హైదరాబాద్ లో పరిశ్రమలు, భారీ ఆస్ధులు కాపాడుకోడానికే రఘురామ కృష్ణంరాజు, సినీనటుడు అలీ యుటర్న్ తీసుకున్నారని రాజకీయ పరిణామాలను గమనిస్తున్నవారు నమ్ముతున్నారు.

అయితే, కెసిఆర్ అనుచిత జోక్యాన్ని బాబు ఆత్మగౌరవ నినాదంతో విమర్శించ గలరే తప్ప రుజువులు దొరకని కెసిఆర్ కుటిలనీతిని అడ్డుకోలేరు.

ఐదేళ్ళ తరువాత కూడా జగన్ పై పాత ఆరోపణలు చేయడం వల్లా అవే విమర్శలు కొనసాగించడం వల్లా తెలుగుదేశానికి అదనపు ప్రయోజనమేమీ వుండదు. అయితే ఐదేళ్ళలో పాలనా వైఫల్యాలను, అవినీతిని ఎత్తి చూపడం జగన్ కి ఈ ఎన్నికలు ఇచ్చిన అదనపు అవకాశం… బాబు “అమరావతి” పేరెత్తగానే బిల్లులు ఇవ్వలేదని బిజెపి, డబ్బుతినేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరుముకూత మొదలుపెడుతుంది.

ఇన్ని ప్రతికూలత మధ్య ప్రత్యర్ధులతో తలపడుతున్న తెలుగుదేశం పార్టీకి లోపలి అసమ్మతి తిరుగుబాటు మరొక పెద్ద సమస్యే! ఆపార్టీకి గట్టి పట్టువుందనుకున్న తూర్పుగోదావరి జిల్లానే ఒక ఉదాహరణగా తీసుకుంటే కాకినాడ ఎంపి తోట నరశింహం ఎదురుతిరిగి జగన్ పార్టీలో చేరి భార్య వాణితో పెద్దాపురం నుంచి శాసన సభకు పోటీ చేయిస్తున్నారు. అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు కూడా జగన్ కండువా కప్పేసుకున్నారు. రాజమండ్రి ఎంపి మురళీమోహన్ రాజకీయాల నుంచి విరమించుకున్నారు. వారసత్వంగా సీటు దక్కిన ఆయన కోడలు రూప గెలుపుకోసం పార్టీనాయకుల చుట్టూ ఆయన తిరుగుతున్నారు. మొదటినుంచీ పార్టీలోనే వున్న గన్ని కృష్ణ ప్రతీసారీ టికెట్ మిస్సవుతూ ఈసారి తప్పక వస్తుందని ఆశించారు. నాటకీయంగా రూపకు టికెట్ రావడంతో అప్ సెట్ అయిన గన్ని ప్రభావం రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం అసెంబ్లీ సెగ్మెంట్ల మీద వుంటుంది.

పెద్దాపురంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన జగన్ పార్టీ అభ్యర్ధి వాణి, గతంలో జగన్ పార్టీలోకి వెళ్ళి, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చిన తిరుదుబాటు దారుడు బొడ్డు భాస్కరరామారావు

ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజయావకాశాలను సవాలు చేస్తున్నారు.

40 ఏళ్ళ పార్టీకి ఈమాత్రం తిరుగుబాట్లు, అసమ్మతులు సహజమేనని నామినేషన్ ఘట్టం ముగిసేసరికల్లా పరిస్ధితిని చక్కదిద్దగలమని పార్టీ నాయకులు నమ్మకంగా చెబుతున్నారు.

అసలే బొటాబొటి, ఆపై కనబడని శత్రువు కుటిలనీతి – మధ్య యుద్ధం చేస్తున్న తెలుగుదేశం, చుట్టూ వున్న ప్రతికూలతల నుంచి డ్వాక్రా మహిళల రుణమాఫీ, 10 వేల రూపాయల పసుపు కుంకుమల కానుక మొదలైన సంక్షేమ పధకాలే గట్టెక్కించగలవని గట్టిగా నమ్ముతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close