“దమ్ముంటే ప్రతిపక్షహోదా ఇవ్వు అసెంబ్లీకి వస్తా” అని అధికార పార్టీని సవాల్ చేసే రాజకీయ నిరక్షరకుక్షి మన దేశంలో ఎక్కడా ఉండదు.. ఒక్క. వైసీపీ తప్ప. అధికార పార్టీని దేబిరించి ఏదో తెచ్చుకుని వారిపై పోరాడతానని చెప్పుకుంటే పిచ్చకామెడీగా ఉంటుంది. వైసీపీ అదే కామెడీ చేస్తోంది. తమ చేతికి ఆయుధం ఇస్తే వచ్చి పోరాడతామని లేకపోతే ఇంట్లో కూర్చుకుంటామని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలతో వారు ప్రజల కోసం పోరాడేదేమీ ఉండదు… తమ కోసం కూడా పోరాడుకోలేరు. ఆ వైసీపీ చేతకానితనమే టీడీపీకి బలంగా మారుతోంది.
ఆ దివాలా ఆలోచనల నుంచి బయటకు రారా ?
అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారాపడాలనుకోవడం ఏమిటి..దానికి మళ్లీ దమ్మూ, ధైర్యం అనే డైలాగులు ఎందుకు?. ప్రజలు ఇచ్చింది తీసుకుని ప్రజల కోసం పోరాడాలి. అంతే కాని లేని హోదాలు.. రాని హోదాల కోసం ఎందుకు లేనిపోని పంతాలకు పోవడం. హోదా కావాలి అని ప్రభుత్వాన్ని అడగడమే సిగ్గుమాలిన పని. దయాదాక్షిణ్యాలపై మీద ప్రభుత్వమే ఇచ్చేది అయితే.. మాకు వద్దు అనే చెప్పేలా రాజకీయం ఉండాలి కానీ.. వైసీపీ పూర్తిగా దివాలా తీసిన పార్టీ. అందుకే ప్రభుత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.
హోదాతో వచ్చేది ఏముంది ?
ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో గుర్తింపు ఉన్నా లేకపోయినా జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతనే. ఆయనేమీ అధికార కూటమిలో సభ్యుడు కాదు. బీజేపీ దయాదాక్షిణ్యాలపై కోసం ఎప్పుడూ ఆ పార్టీకి మద్దతుగా ఉంటారు కానీ ఎన్డీఏలో చేరలేదు. ఎన్డీఏలో భాగస్వామిని అని జగన్ అనుకుంటే.. ఎవరూ ఏమీ చేయలేరు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు వచ్చే ప్రోటోకాల్ లో మార్పులు ఉండవు. అసెంబ్లీలో ఆయన ఒక్కరే ఇతర పార్టీ నేత. అందుకే మాట్లాడేందుకు..తమ వాదన వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఆ విషయాన్ని స్పీకర్ కూడా పలుమార్లు చెప్పారు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా మాట్లాడే చాన్స్ వస్తుంది. కానీ జగన్ అసెంబ్లీకి వెళ్లడానికి భయపడుతున్నారు.
సజ్జల లాంటి సలహాదారులతో ఇంత కంటే ఏం సాధిస్తారు?
దోచుకునే తెలివితేటలు మాత్రమే ఉండే సజ్జల.. ఎలా రాజకీయాలు చేయకూడదో అలా రాజకీయాలు చేయాలని సలహాలిచ్చే సజ్జల లాంటి వారు జగన్ చుట్టూ ఉన్నంత కాలం.. ఇలాగే రాజకీయాలు ఉంటాయి. వైసీపీ దివాలా తీసిన పార్టీగానే ఉంటుంది. కాస్త ప్రజాస్వామికంగా ఆలోచించి.. ప్రజా కోణంలోనే పోరాటాలు చేసే దిశగా అడుగులు వేస్తే.. కనీసం దివాలా స్థితిని నుంచి బయటకు వస్తారు. లేకపోతే.. ఆ పార్టీ కోలుకోవడం అసాధ్యం.