కరిగిపోతున్న టీడీపీ ఓటు బ్యాంక్..!

అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 40 శాతం ఓట్లను తెచ్చుకున్న టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో మరింతగా దిగజారిపోయింది. ఎన్నికలు జరిగిన నగరాలు, పట్టణాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 30.73గా తేలింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో 39పైనే ఉంది. అంటే… దాదాపుగా తొమ్మిది శాతం ఓట్లను రెండేళ్లలో టీడీపీ కోల్పోయిందని అనుకోవచ్చు. అయితే.. ఇవి పట్టణాల ఓట్లే.. పల్లెల్లో ఓటింగ్ పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి అంచనా వేయలేం. కానీ టీడీపీ మాత్రం.. తన ఓటు బ్యాంక్‌ను కోల్పోతోందన్నది మాత్రం.. స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ తన ఓట్ల శాతాన్ని బాగా మెరుగుపర్చుకుంది.

మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 52.63 ఓట్లు వైసీపీకి దక్కాయి. బిజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం ఓట్లు పొందాయి. నోటాకు 1.07 శాతంగా ఓట్లు పడ్డాయి. ఏపీలో మొత్తం ఐదు కోట్ల మంది వరకూ ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంది కేవలం.. 47 లక్షల 46వేల మంది మాత్రమే. చాలా చోట్ల ఏకగ్రీవం కావడంతో ఓట్లు నమోదు కాలేదు. ఈ కారణంగా విపక్షాల ఓట్లలో భారీగా కోత పడింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ ఓటు షేర్ పెరిగింది. విపక్షాల ఓట్ల శాతం తగ్గింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వైసీపీ రిపీట్ చేసింది. ఇంకా చెప్పాలంటే రెండు శాతం అదనపు ఓట్లను సాధించింది. టీడీపీ ఓట్లకు భారీగా గండి పడింది. తొమ్మిది శాతం ఓట్లు కోల్పోయినా… వాటిని బీజేపీ- జనసేన అందుకోలేకపోయాయి. రెండు శాతం వైసీపీ పొందినా.. మిగతా ఎవరు పొందారన్నది ఆసక్తికరం. వైసీపీ రెబల్స్ పలు చోట్ల గెలిచారు. వారికి ఐదు శాతం ఓట్లు వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close