టీడీపీ ఉల్లి పోరాటానికి.. వైసీపీ “హెరిటేజ్” ఎదురుదాడి..!

ఉల్లి ధరలు పెరిగిపోయినా… ప్రభుత్వం నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతోందని… తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఆందోళన చేసింది. ఉల్లి దండలను ..మెడలో వేసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై చర్చించాలని… అసంబ్లీలో ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు పట్టుబట్టారు. అయితే.. దీనిపై సభలో.. ముఖ్యమంత్రి స్పందించారు. బయట మంత్రి మోపిదేవి సమాధానం ఇచ్చారు. చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. ఇక్కడకు వచ్చి… పేపర్లు పట్టుకుని దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి మోపిదేవి.. తర్వాత విడిగా ప్రెస్‌మీట్ పెట్టి.. హెరిటేజ్‌లో రూ. 130 కి కేజీ ఉల్లి ‌అమ్ముతున్నారని.. చంద్రబాబుకు .. ప్రజలపై అంత ప్రేమ ఉంటే.. తక్కువకు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.

మీడియా పాయింట్‌లో మాట్లాడిన.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. హెరిటేజ్‌లో ఉల్లిపాయ రేట్లను చూసే… టీడీపీ నిత్యావసర ధరలపై చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు. తాము ప్రజలకు రూ. 25కే ఉల్లి అందిస్తూంటే.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి హెరిటేజ్ ఫ్రెష్‌ దుకాణాలు.. ఇప్పుడు.. చంద్రబాబు కుటుంబానికి చెందిన చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందినవి కావు. వాటిని… రెండు, మూడేళ్ల క్రితమే.. బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ లాంటి దుకాణాల సముదాయం ఓనర్ అయిన.. కిషోర్ బియానీకి చెందిన ప్యూచర్ రిటైల్ అనే కంపెనీకి అమ్మేశారు.

వంద శాతం.. వాటాను.. అమ్మేసినట్లు అప్పుడే ప్రకటించారు. ఈ వాటాల అమ్మకంపై.. జగన్ తో పాటు.. రోజా లాంటి నేతలు విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ.. ఇప్పటికీ.. హెరిటేజ్ ఫ్రెష్‌ చంద్రబాబు కుటుంబానిదేనని..అందులో ధరలు ఎక్కువ ఉన్నాయన్నట్లుగా.. అసెంబ్లీలోనూ బయట విమర్శలు చేస్తూ.. రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close