ఒక రోజంతా సమయం వుంది. ఇంగ్లాండ్ గెలావంటే 35 పరుగులు కావాలి. ఇండియా నెగ్గాలంటే నాలుగు వికెట్లు తీయాలి. ఇలాంటి ఈక్వేషన్ లో ఇండియా గెలావాలంటే ఓ అద్భతమే జరగాలి. నిజంగా అలాంటి అద్భుతం జరిగిపోయింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్ను 2-2తో ముగించింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ సిరాజ్ 5, ప్రసిద్ధ్ కృష్ణ 4, వికెట్లతో చెలరేగారు.
హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలు సాధించడంతో ఒక దశలో భారత్ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ నెవర్ గీవ్ అప్ అనే మాటకు అర్ధం చెప్పారు మనఆటగాళ్ళు. చివరి నిమిషం వరకూ ఆశలు కోల్పోకుండా ఆడారు. విజయం సాధించారు. సిరిస్ ఫలితం డ్రాగా ముగిసినప్పటికీ ఇది విజయంతో సమానం. ఈ సిరీస్, మనఆటగాళ్ళ పోరాటం ఇండియా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది.