స్థానికతే ప్రధాన అడ్డు: షర్మిల ఆధార్, ఓటర్ కార్డు ఎక్కడున్నాయో చెప్పాలె: తీన్మార్ మల్లన్న

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పేరు ప్రముఖంగా వినిపిస్తున్న మాట తెలిసిందే. తాను తెలంగాణ కోడలి ని అంటూ తెలంగాణ రాజకీయాల్లో కి అడుగుపెట్టిన షర్మిల కు తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజులలో షర్మిలకు స్థానికతే ప్రధాన అడ్డంకి అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే

మీడియా కవరేజ్ లేక పోవడం అన్న అడ్డంకి ని దాటేసిన షర్మిల:

షర్మిల తెలంగాణ లో రాజకీయాలు చేయడానికి బలంగా ప్రిపేర్ అయిపోయారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా మీడియా అండదండలు లేక పోతే వాటి గతి ఏమైపోతుందో ప్రజా రాజ్యం, జన సేన పార్టీ లు నిరూపించాయి . అయితే ఈ విషయంలో ముందు జాగ్రత్త పడ్డ షర్మిల, మీడియా మేనేజ్మెంట్ లో తాను ఎంత సిద్ధ హస్తురాలో అన్న సంగతి ఇప్పటికే నిరూపించుకుంది. ఆమె పార్టీ లాంచ్ చేయక ముందు నుండి అన్ని ప్రధాన మీడియా చానల్స్ ఆవిడ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి డిబేట్ లు పెట్టడం, ఆవిడ జూబ్లీ హిల్స్ లోని హోటల్ లో పార్టీ ని లాంచ్ చేసిన సందర్భంగా లైవ్ కవరేజ్ ఇవ్వడం, ఆవిడ చేసే ప్రతి కార్యక్రమానికి ప్రైమ్ టైం లో కవరేజ్ ఇవ్వడం వంటివి చేశాయి. అయితే షర్మిల విషయంలో ప్రధాన అడ్డంకి ఆమె స్థానికత కానున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే ఆమె తనను తాను తెలంగాణ కోడలు అని చెప్పుకుంటున్నప్పటికీ తెలంగాణ ప్రజలలో దీని పట్ల సానుకూలత వ్యక్తం కాలేదు. దానికి ప్రధాన కారణం షర్మిల భర్త అనిల్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో నే అయినప్పటికీ, వారి తల్లి దండ్రులకు ఆంధ్రప్రదేశ్ లో మూలాలు ఉండడమే. అయితే ఇప్పుడు ఇదే స్థానికత అంశం పై తీన్మార్ మల్లన్న షర్మిల ని టార్గెట్ చేశారు.

షర్మిల ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్న తీన్మార్ మల్లన్న:

తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం గా మారారు. ఉప ఎన్నికలో ఒక స్వతంత్ర అభ్యర్థి జాతీయ పార్టీలైన బీజేపీ మరియు కాంగ్రెస్ లను మించి ఓట్లు సాధించి అధికార పార్టీ అభ్యర్థి కి గట్టి పోటీ ఇవ్వడం అన్నది ఆషా మాషీ సంగతి కాదు. అయితే దాన్ని సాధించి చూపించిన తీన్మార్ మల్లన్న కు యువతలో బాగానే ఫాలోయింగ్ ఉంది. దీంతో పాటు తీన్మార్ మల్లన్న కూడా త్వరలోనే గద్వాల్ జిల్లా నుండి మొదలు పెట్టి పాద యాత్ర చేస్తానని ప్రకటించారు. మరొక వైపు షర్మిల కూడా ఇదే సమయంలో పాద యాత్ర చేయాలని ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి, బిజెపి తరఫున బండి సంజయ్ లు కూడా పాద యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరిద్దరి తో పాటు ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉంది. దీంతో పోటా పోటీగా ఒకే సమయంలో జరిగే ఈ పాదయాత్రలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది . షర్మిల ఏ రకంగా ఇతర పార్టీలను టార్గెట్ చేసినా, షర్మిల పార్టీకి ఇదే పాద యాత్రలో తీన్మార్ మల్లన్న తో సహా ఇతర పార్టీల నాయకుల నుండి గట్టి విమర్శలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణ లో షర్మిల రాజకీయాలు చేసే ప్రయత్నాలను ఆవిడ ప్రత్యర్థలు స్థానికత నినాదాన్ని పైకి తీసుకువచ్చి అడ్డుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పాద యాత్ర ప్రారంభం కాక మునుపే తీన్మార్ మల్లన్న షర్మిల ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయాలు చేయాలని ఆశ పడుతున్న షర్మిల తన ఆధార్ కార్డు , తన ఓటర్ కార్డు ఎక్కడ ఉన్నాయో చెప్పాలంటూ షర్మిల ను ఇరుకున పెడుతున్నారు. మిగతా ఏ అంశాలపై రాజకీయ ప్రత్యర్థుల నుండి ప్రశ్నలు వచ్చినా సమాధానం ఇవ్వగలుగుతున్న షర్మిల, స్థానికత విషయం ప్రస్తావన కు వచ్చే సరికి తడబడుతున్నారు.

షర్మిల పార్టీ స్థానికత విషయంపై వచ్చే ఈ ప్రశ్నలకు ప్రజలను కన్విన్స్ చేయగలిగేలా సమాధానం ఇవ్వకుండా, ఆమె పార్టీ తెలంగాణలో పుంజుకోవడం సందేహమే. మరి ఈ సమస్యను షర్మిల ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close