ఎక్స్‌క్లూజీవ్‌: తేజా స‌జ్జా – దుల్కర్ – మంచు మ‌నోజ్ సినిమా

ఈ సంక్రాంతికి ‘హ‌నుమాన్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు తేజా స‌జ్జా. ఆ త‌ర‌వాత కూడా క్రేజీ ప్రాజెక్టే సెట్ చేసుకొన్నాడు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తేజా న‌టిస్తున్నాడ‌ని, ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంద‌ని తెలుగు 360 ముందే వెల్ల‌డించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మ‌రో ఇద్ద‌రు హీరోలు వ‌చ్చారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మంచు మ‌నోజ్ కూడా తేజాతో చేతులు క‌లిపారు. ‘హ‌నుమాన్‌’ కంటే భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికి కొంత మేర షూటింగ్ జ‌రిగింది. ఇది కూడా సూప‌ర్ హీరోకి సంబంధించిన క‌థే అని స‌మాచారం. మ‌రి ఇందులో దుల్క‌ర్‌, మ‌నోజ్‌ల పాత్ర‌లు ఎలా ఉంటాయ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఈగ‌ల్’ ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి, చివ‌రి క్ష‌ణంలో త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ‘ఈగ‌ల్‌’ కంటే ముందే కార్తీక్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. కార్తీక్‌కి ‘ఈగ‌ల్’ ఛాన్స్ రావ‌డం, తేజా కూడా ‘హ‌నుమాన్‌’తో బిజీ అవ్వ‌డంతో కాస్త బ్రేక్ ప‌డిగంది. ఇప్పుడు ‘ఈగ‌ల్’ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌కు రెడీ అయ్యింది. ఆ త‌ర‌వాతే… ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close