తెలకపల్లి రవి : వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ పొరబాటు గనకనే…

తనపై హత్యాప్రయత్నానికి సంబంధించిన దర్యాప్తులో ఎపి పోలీసులపై నమ్మకం లేదు గనక మూడవ పక్షంతో చేయించాలని వైసీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానికి ముందు ఆ పార్టీ మాజీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి కూడా ఇలాటి పిటిషనే వేసి వున్నారు. ఆ తర్వాత ఆయనతో సహా ఆ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లి హొం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి దర్యాప్తు చేయాలని కోరి వచ్చారు. కేంద్రం జోక్యం కోరడమేమిటి కావాలంటే కోర్టుల సహాయం కోరవచ్చునని నేను అదే రోజు సాక్షి చర్చలో అన్నాను. హైకోర్టులో కూడా పిటిషన్‌ వేశారని చర్చ నిర్వహిస్తున్న అమర్‌ చెప్పారు. అయితే తర్వాత తెలిసిందేమంటే అప్పటికి వేసిన పిటిషన్‌ సరికాదట. ఇలాటి దాడి ఘటనల్లో బాధితుడు తప్ప బయిటవారు వేస్తే చెల్లదట. వైవీ సుబ్బారెడ్డి పేరుతో వేసిన దాన్ని కోర్టు స్వీకరించే అవసరం లేదని తేలడంతో జగన్‌ స్వయంగా పిటిషన్‌ వేశారు. కేంద్రం జోక్యమే గాక న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించామని చెప్పడానికి కూడా ఇది ఉపయోగకరమని భావించి వుండొచ్చు. విమానాశ్రయంలో భద్రతా లోపం వల్లనే జగన్‌పై దాడి జరిగినట్టు,సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరుకు చెందిన అనిల్‌ కుమార్‌ రెండు రోజుల కిందట ఒక ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) కూడా దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఈ రోజున జగన్‌ పిటిషన్‌ స్వీకరించింది గాని ఈ మూడింటిని కలిపి మంగళవారం విచారించాలని నిర్ణయించింది. మరి తుది ఆదేశాలు ఎలా వుంటాయో తెలియదు. దాడి ఘటన తీవ్రతపైన, పోలీసుల తీరుపైన, రాజకీయ పార్టీల ఆరోపణలపైన హైకోర్టు ఏదైన వ్యాఖ్యానించే అవకాశముంది. ముందే సందేహాలు ఎందుకని ఏదైనా జరిగితే అప్పుడే రావాలని కూడా చెప్పొచ్చు. అలాగాక కొన్ని కేసుల్లో వలె రాష్ట్ర పోలీసుల తీరును తప్పుపట్టొచ్చు కూడా. ఏవైనా ఆదేశాలతో మరోసారి విచారణ వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నీల‌కంఠ‌తో రాజ‌శేఖ‌ర్‌

షో సినిమాతో ఆక‌ట్టుకున్నాడు నీల‌కంఠ‌. మిస్స‌మ్మ త‌న‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప‌లు అవార్డులు అందించింది. దాంతో క్లాస్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలంగా నీల‌కంఠ ఖాళీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు...

అపెక్స్ భేటీలో ఏపీ, కేంద్రం నోళ్లు మూయిస్తాం: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. స్నేహహస్తం చాచినా.. కావాలని కయ్యం పెట్టుకుంటోందని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర విధానాలు కూడా సరిగ్గా లేవన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని...

13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెబుతారా..?: చంద్రబాబు

ఐదేళ్ల పాలనలో 13 జిల్లాలకు తెలుగు దేశం హయాంలో ఏం చేశామో.. ఎలా అభివృద్ది వికేంద్రీకరణ చేశామో... టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు వివరించారు. పదమూడు నెలల్లో...వైసీపీ సర్కార్ ఏం చేసిందో...

మీడియా వాచ్‌: తీవ్ర సంక్షోభంలో ‘ఈనాడు’

తెలుగులో అగ్ర‌గామి దిన‌ప‌త్రిక ఈనాడు. ద‌శాబ్దాలుగా నెంబ‌ర్ వ‌న్‌గా చ‌లామణీ అవుతోంది. అయితే... క‌రోనా నేప‌థ్యంలో నెంబ‌ర్ వ‌న్ సంస్థ సైతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా ఉప‌ద్ర‌వానికి ముందు ఈనాడు...

HOT NEWS

[X] Close
[X] Close