తెలంగాణ బీజేపీ బుడగ పేలిపోయిందా..!?

దుబ్బాక ఉపఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో వచ్చిన గెలుపు.. గ్రేటర్ ఎన్నికల్లో యాభై కంటే తక్కువ డివిజన్లలో గెలుపు బీజేపీ నేతల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక తెలంగాణలో తమదే ఆధిపత్యం అని వారు కిందా మీదా పడి ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. వరుస ఎన్నికల రాజకీయ పరమపద సోపానంలో.. ఇప్పుడు వారు ఎమ్మెల్సీ ఎన్నికల బారిన పడ్డారు. మళ్లీ అట్టడుగుకు చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కళ్లు మూసుకుని కమలం గుర్తుకు గుద్దేస్తాని.. పీవీ కుమార్తె కాదు కదా.. సీఎం కేసీఆర్ నిలబడినా గెలిచేస్తామని ఉర్రూతలూగిన బీజేపీ నేతలకు ఇప్పుడు ఫలితాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. బీజేపీది బలుపు కాదు వాపు అని ఇతర పక్షాలు విమర్శించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు గొప్ప అవకాశంగా మారిపోయాయి.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్ఠభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు. అంటే ఆయనను ఓటర్లు అసలు పరిగణనలోకి తీసుకోలేదని అర్థం. ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి అంటే బీజేపీనే. ఇంతకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నేత ఆయన. ఒక్క బీజేపీ అనే బ్రాండ్‌ను నమ్ముకునే రంగంలోకి దిగారు. కానీ అసలు రేసులోనే లేరు. ఇక హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు కూడా పరాజయం బాట పట్టారు. ఈ స్థానంలో కేసీఆర్ పోటీ చేసినా గెలుస్తానని ఆయన బీరాలు పోయారు. బీజేపీకి ఎలాంటి హవా లేనప్పుడే గెలిచానని ఇప్పుడు అంతా బీజేపీ మయమని ఎందుకు గెలవనని ఆయన ధీమా కావొచ్చు. కానీ అక్కడా టీఆర్ఎస్సే ఆధిక్యంలో ఉంది. చివరికి తానే గెలుస్తానని ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కానీ.. గ్యాప్ పెరిగిపోతూనే ఉంది. ఆయన అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి.

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు సాగర్ సమరం ఎదురుగా ఉంది. గత ఎన్నికల్లో రెండు అంటే రెండు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నసాగర్‌లో ఇప్పుడు… కనీస ప్రభావం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. జానారెడ్డి దశాబ్దాల పాటు గెలిచిన గడ్డ. బీజేపీకి అభ్యర్థి లేరు. నిన్నటి వరకూ ఆ పార్టీ తరపున పోటీకి కొంత మంది పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. ప్రజల్లో బీజేపీ పట్ల అంత మేనియా లేదని క్లారిటీ వచ్చిన తర్వాత చాలా మంది వెనుకడుగు వేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి సాగర్ ఎన్నిక మరో పరీక్ష పెట్టబోతోంది. అక్కడ గెలవడం కాదు.. కనీస ప్రభావం చూపించాల్సి ఉంది. చూపించలేకపోతే.. ఆ పార్టీ మళ్లీ గతంలాంటి బీజేపీగా మారిపోతుంది. అప్పుడు… బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు చేసే ప్రకటనలు… కామెడీ అయిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close