సోము వీర్రాజు వల్ల కావట్లేదని తెలంగాణ బీజేపీ నేతలు రంగంలోకి దిగారా..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెలంగాణ బీజేపీ నేతల జోక్యం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై బండి సంజయ్, రాజాసింగ్ సహా ఇతర బీజేపీ నేతలందరూ విమర్శలు చేస్తున్నారు. అవి సాదాసీదా విమర్శలు కాదు. ప్రజలు తరిమికొడతారనే ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరంతా హిందూత్వ బ్రాండ్‌లు. ఏపీలో జరుగుతున్న ఆలయాల దాడుల వ్యవహారంలో ఈ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ నేతల ప్రకటనలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మరి ఏపీ నేతలు ఎందుకు అంత దూకుడుగా ఉండలేకపోతున్నారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. అందరూ సోము వీర్రాజు వైపు అదో రకంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ప్రో వైసీపీ బ్యాచ్ హవా ఎక్కువగా ఉంది. వారు జగన్ పై చేస్తున్న విమర్శలు.. విమర్శలుగా కాక.. సుద్దులు చెబుతున్నట్లుగా ఉంటున్నాయి. దీంతో ప్రజల్లో కామెడీ అవుతున్నాయి.

వైసీపీపై విమర్శల దాడి చేసి.. ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఆలోచన ప్రస్తుత ఏపీ బీజేపీ నేతల్లో ఎవరికైనా ఉందో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఏమైనా అంటే ముందుగా చంద్రబాబు అలా చేశాడు.. జగన్ కొంతే చేస్తున్నాడు.. అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు. దాంతో.. వీరంతా జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఏపీ బీజేపీ తరపున తెర ముందుకు వస్తున్న సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేది.. అందరికీ తెలిసిన విషయం. వారేం మాట్లాడినా ముందుగా చంద్రబాబు ప్రస్తావనే వస్తోంది. దీంతో సీరియస్ నెస్ పోతోంది. వారు వైసీపీకి ఫేస్ సేవింగ్ గా మీడియా ముందుకు వస్తున్నారన్న అభిప్రాయం బలపడిపోయింది.

ఇలాంటి సమయంలో రాజకీయంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో… బీజేపీ హైకమాండ్ పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. తెలంగాణ బీజేపీ నేతలతోనే… ఏపీ సీఎంపై విమర్శలు చేయించి.. కాస్త హిందూ సెంటిమెంట్‌ను పెంచుకోవచ్చని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే… వివాదాస్పద స్టేట్‌మెంట్లతో… తెలంగాణలో బీజేపీకి కాస్త మైలేజీ తెచ్చి పెట్టిన బండి సంజయ్ ను.. ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. తిరుపతి ఉపఎన్నికకు ముడిపెట్టి.. కొద్దిగా రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేత చేపిస్తున్నారు. సోము వీర్రాజు.. జగన్ పై అలాంటి విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే.. బండి సంజయ్ వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.

అయితే.. తెలంగాణలోలా ఏపీలోనూ మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే విమర్శలను సహజంగానే ఎదుర్కొంటోంది. కానీ వీటిని బీజేపీ ఎప్పుడూ విమర్శలుగా పట్టించుకోదు. వారి రాజకీయం వారిది. కానీ ఆ రాజకీయాన్ని కూడా ఏపీ బీజేపీ నేతలు వంట బట్టించుకోకుండా… అధికార పార్టీకి కొమ్ము కాయడం.. అధికార పార్టీపై విమర్శలు చేసే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం.. దూరం పెట్టడం వంటి చర్యలు చేపట్టడం వల్ల… మొత్తానికి ఏపీ బీజేపీ నేతలు.. ప్రో వైసీపీ అని.. హైకమాండ్ కూడా నమ్మే పరిస్థితి ఏర్పడిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

“అన్యాయ మాటలు”.. సీజేఐ వైదొలగాలనే డిమాండ్లు..!

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన...

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

HOT NEWS

[X] Close
[X] Close