త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ…!?

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని విస్తరించనున్పారా…? కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ ఆసంత్రప్తితో ఉన్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. తన కుమారుడికి ముఖ్యమంత్రి పట్టం కట్టే ముందు మంత్రివర్గాన్ని ఆయనకు అనుకూలంగా మార్చాలన్నది సీఎం కేసీఆర్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

మంత్రివర్గంలో కొందరు ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే సరైన బాటను వేసుకోవాలన్నది కేటీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. శాసనసభ్యుల్లో తనకు అనుకూలురైన కొందరికి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు వారిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రుల్లో జగదీష్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రుల పనితీరుపై కేటీఆర్ ఆగ్రహంగా ఉన్నరంటున్నారు. వీరిలో జగదీశ్వర రెడ్డి మినహా మిగిలిన వారిపై కేసీఆర్ కూడా అసంత్రప్తిగా ఉన్నట్లు సమచారం. అటు తన నిర్ణయం, ఇటు కుమారుడి ఆలోచన ఒకేలా ఉండడంతో మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలికి మరికొందరికి అవకాశం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా మంత్రివర్గంలో మార్పులు చేసి మెల్లిగా కేటీఆర్ కు అనుకూల వాతావరణం తీసుకురావాలనేది సీఎం కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.రెండు రోజుల క్రితం జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల సమావేశంలో సరిగా పని చేయని వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ఈ హెచ్చరిక ఒక విధంగా మంత్రులకు కూడా చేసినట్లేనని అంటున్నారు. మంత్రుల్లో కొందరిని ద్రష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని, మంత్రులను కొందరిని మార్చేందుకు ఈ హెచ్చరిక ఓ పాచికని అంటున్నారు. తనయుడు కేటీఆర్ నిర్ణయం మేరకు మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ సీనియర్లు కూడా చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అన్నీ తానే అయి చూసుకున్న కేటీఆర్ పార్టీపై పూర్తి పట్టు సాధించారని అంటున్నారు. ఇక పాలనపై కూడా ఆయన ముద్ర ఉండేలా చేసుకుంటారని, అందుకోసం మంత్రివర్గంలో తన వారికి అవకాశం కల్సించనున్నారని అంటున్నారు. మొత్తానికి మరోసారి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com