కరోనా కట్టడికి రెండు చుక్కలు..! ఇది “సైంటిస్ట్ కేసీఆర్” ప్రిస్కిప్షన్ ..!

నిండు జీవితానికి రెండు చుక్కలని.. పోలియో డ్రాప్స్ గురించి ప్రచారం చేస్తూంటారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి ఆ ప్రచారం. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. దాన్ని తరిమికొట్టాడనికి కూడా కేసీఆర్ అలాంటి చిట్కానే అసెంబ్లీలో చెప్పేశారు. రెండు చుక్కలు బదులు.. ఒక్క ట్యాబ్లెట్ ఆయన ఫార్ములా. ” కరోనా ” ఈ పేరుకే ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర్నుంచి అతి సామాన్యుడి వరకూ అందరూ ఉలిక్కిపడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు తలకిందలైపోతున్నాయి. వ్యాపారాలన్ని కుదేలయిపోతున్నాయి. ఆ ప్రభావం సామాన్యులపై పడుతోంది. అంత సీరియస్ అయిన కోరనాను… తెలంగాణ సీఎం కేసీఆర్ కామెడీ చేసి పడేశారు. కరోనాను ఆయన తీసి పడేసిన విధానం చూసి.. అసెంబ్లీలో మంత్రులు.. ఎమ్మెల్యేలు నవ్వాపుకోలేకపోయారు.

మాస్క్‌ల కొరత ఉందన్నందుకు కరోనా పురాణం..!

తెలంగాణలో ప్రస్తుతం మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతగా అంటే.. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా మాస్క్‌లు లేవు. దీనిపైనే విమర్శలు రావడంతో.. కేసీఆర్.. కరోనాను.. ఓ ఆట ఆడుకున్నారు. అసలు కరోనానే లేదు.. ఇక మాస్కులెందుకని ప్రశ్నించారు. అసలు మాస్కులు అవసరం లేదని చెప్పడానికి కరోనా… ఎంత బలహీనమైన వైరస్సో చెప్పే ప్రయత్నాన్ని తనదైన స్టైల్లో చేశారు. పాతిక డిగ్రీలున్న వాతావరణంలోనే కరోనా వైరస్ బద్దలైపోతుందని.. ఇప్పుడు తెలంగాణలోనే 30 నుంచి 35 డిగ్రీల ఎండలున్నాయని… కరోనా వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. అలాంటప్పుడు ఇక మాస్క్‌లెందుకన్నారు. అంతటితో ఆగలేదు.. కరోనా పేషంట్‌పై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. కరోనా వచ్చిన వ్యక్తిని .. అదేదో తన తప్పయినట్లుగా సన్నాసి అంటూ తిట్టేశారు. ఆయనేం చావడంటూ.. పరుషమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వస్తే..మాస్క్‌లు లేకుండా ఎమ్మెల్యేలు వెళ్లి ట్రీట్ చేస్తారని ఎకసెక్కాలాడారు. కరోనా వచ్చిన వాళ్లందరూ చచ్చిపోరని చెప్పడానికి కేసీఆర్ ఈ రకమైన పదజాలాన్ని ఉపయోగించుకున్నారు. చివరికి వెయ్యి కోట్లు అయినా ఖర్చు పెట్టి కట్టడి చేస్తామని గంభీరంగా ప్రకటించారు కానీ.. జనం వెయ్యి కోట్ల గురించి కాదు.. రూపాయి మాస్క్ అడుగుతున్నారనే విషయాన్ని మాత్రం.. ఒప్పుకోలేదు.

పారాసిటమాల్‌కు లోకువైతే ప్రపంచం వణికిపోతోందెందుకు..?

కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేందుకు… కరోనా వైరస్ వచ్చిన వారిని కాపాడేందుకు .. ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు.. వందల కోట్లు వెచ్చించి.. పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎవరూ ఇంత వరకూ.. మందు కనుగొనలేకపోయారు. కనీసం ఏడాదిన్నర పడుతుందని అంచనా వేశారు. కానీ కేసీఆర్ మాత్రం.. చాలా సింపుల్‌గా కనిపెట్టేశారు. ఒక్కటి.. ఒక్కటంటే.. ఒక్క పారాసిటమాల్ టాబ్లెట్‌తో… కరోనా వైరస్ తగ్గిపోతుందని తేల్చారు. ఇలా చెప్పడానికి ఆయన ఓ ప్రముఖ శాస్త్రవేత్త అనే వ్యక్తిని రిఫరెన్స్‌గా వాడుకున్నారు. అసలు మాస్క్ అక్కర్లేదన్నారు. నిజంగా పారాసిటమాల్‌ తోనే కరోనా వైరస్‌ను కట్టడి చేసే పని అయితే.. ప్రపంచం మొత్తం ఎందుకు ఇంత హైరానా పడుతుంది…? కొన్ని లక్షల కోట్ల సంపదను ఎందుకు కోల్పోతోందన్నది.. లాజిక్ కు అందని ప్రశ్న. అలా అని ఎవరైనా కేసీఆర్‌ను కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించి ఉంటే.. ఊహించని సమాధానం వచ్చి ఉండేది కానీ.. అప్పటికే కాంగ్రెస్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు కాబట్టి.. పారాసిటమాల్ ప్రిస్కిప్షన్ అంతటితో ఆగిపోయింది.

“కరోనా” మనిషి అయితే ఈ పాటికి కుంగికృశించిపోయేది..!

రాజకీయ ప్రత్యర్థులను మాటలతో మానసికంగా కృంగిపోయేలా తిట్టడంలో.. కేసీఆర్ ను మించిన వారు… రాజకీయంలో లేరు. అదే పద్దతిని ఆయన కరోనాపై ప్రయోగించారు. కరోనా వైరస్ కాబట్టి సరిపోయింది.. దానికి ప్రత్యేకంగా మెదడు.. భాష ఏమీ తెలియవు. అంటుకోవడం మాత్రమే తెలుసు. అదే నిజంగా కరోనా మనిషి అయి ఉంటే.. కేసీఆర్ మాటలకు.. కుంగి.. కృశించి.. బతికుంటే.. ప్రపంచాన్ని మొత్తం అంటుకోవచ్చు కానీ.. తెలంగాణకు మాత్రం రాకూడదని పారిపోయి ఉంది. కేసీఆర్ మాటలు వింటే కరోనా పేషంట్ కి కూడా అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది.

కొసమెరుపేమిటంటే… కొద్ది రోజులుగా.. తెలంగాణలో ఓ వృద్ధుడు కరోనా గురించి చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వచ్చినా.. మా కేసీఆర్ ఉన్నాడు.. తరిమికొట్టేస్తాడు.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కరోనాను తరమికొట్టలేడా.. అన్న లాజిక్‌తో ఆ వృద్ధుడు మాట్లాడారు. దానిపై చాలా మంది రెండు రకాల అర్థాలు తీసుకున్నారు. కొంత మంది అది జనంలో కేసీఆర్ పై ఉన్న నమ్మకం అంటే… కేసీఆర్ జనాల్ని ఎంత పిచ్చోళ్లను చేశారో.. అదే సాక్ష్యం అని మరికొందరు వాదిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ స్పీచ్ కూడా ఇలాంటి వారిని బాగా ఆకట్టుకుంటుంది. కానీ మాస్కులు…. జాగ్రత్తలు.. ఏర్పాట్లు అంటూ ప్రశ్నించే వారికి మాత్రం.. మండిపోతుంది. కానీ ఎవరేం చేయలేరు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close