కేసీఆర్ తీరు వల్ల తెలంగాణాకి నష్టం?

ప్రధాని మోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 9 మంది కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వారి పార్టీ భూసేకరణ చట్ట సవరణలను వ్యతిరేకిస్తోంది కనుక పార్లమెంటులో దాని ఆమోదానికి మద్దతు కూడా గట్టేందుకు ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని ఉపయోగించుకోబోతున్నారని గ్రహించడంతో వారందరూ తమ పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఈ సమావేశానికి హాజరవలేదు. కనుక వారు హాజరు కాకపోవడం సహజమేనని భావించవచ్చును. ఇంచుమించు అదే కారణంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, జయలలిత, అఖిలేష్ యాదవ్ మరియు నవీన్ పట్నాయక్ కూడా ఈ సమావేశానికి హాజరవలేదు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం నిత్యం ప్రధాని మోడీ చుట్టూ, కేంద్రమంత్రుల చుట్టూ తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నపుష్కరాలలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈ సమావేశానికి స్వయంగా వెళ్ళలేకపోవడంతో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుని పంపారు. ప్రధాని మోడీకి ఆయన పరిస్థితి తెలుసు కనుక అపార్ధం చేసుకొనే అవకాశం లేదు. కానీ కీలకమయిన ఈ సమావేశానికి తెలంగాణా ముఖ్యమంత్రి డుమ్మా కొట్టడంపై అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా నిధులు విడుదల చేయడం గురించి చర్చించడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏవో కుంటిసాకులు చూపించి కేసీఆర్ డుమ్మా కొట్టడం సరయిన నిర్ణయం కాదని తద్వారా కేంద్రానికి ఆయన తప్పుడు సంకేతాలు పంపినట్లయిందని, అంతేకాక తన ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానికి స్వయంగా వివరించి మరిన్ని నిధులు రాబట్టే సువర్ణావకాశం కోల్పోయారని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ప్రధాని మోడీకి మరింత దగ్గరయ్యే సువర్ణావకాశాన్ని కూడా ఆయన కోల్పోయారని అభిప్రాయపడుతున్నారు.
ఆయన డిల్లీ వెళ్ళాక పోవడానికి పుష్కరాల నిర్వహణ, మునిసిపల్ కార్మికుల సమ్మె కారణాలని పైకి చెపుతున్నప్పటికీ, ఓటుకి నోటు కేసులో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాటలు విని తనను నిలువరించినందుకు కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నందునే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబు నాయుడుని, ఆయన పార్టీని చావుదెబ్బ తీసి మళ్ళీ తెలంగాణాలో కనబడకుండా చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సైందవుడిలా అడ్డుపడటంతో వదులుకోవలసి వచ్చినందుకు ఆయన ఆగ్రహించి ఉండవచ్చని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో కేంద్రం మాట కాదని కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం అడుగు ముందుకు వేసినా సెక్షన్: 8ని అమలుచేయడానికి వెనుకాడబోనని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఇచ్చిన సంకేతాలు కూడా ఆయనకి తీవ్ర ఆగ్రహం కలిగించి ఉండవచ్చని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఎన్ని సమస్యలు సవాళ్ళు ఎదురయినా చంద్రబాబు నాయుడు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినందునే మోడీ ప్రభుత్వం ఆయనకి కష్టకాలంలో అండగా నిలిచిందనే విషయం కేసీఆర్ కూడా మరిచిపోకూడదని వారు సూచిస్తున్నారు. తెలంగాణా కంటే కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోంది అంటే దానికి కారణం రాష్ట్ర విభజన బిల్లులో హామీలను అమలు చేయాలనే షరతులొక్కటే కారణం కాదు, వాటి అమలుకోసం చంద్రబాబు నాయుడు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సాగిస్తున్న సత్సంబంధాలు కూడా ప్రధాన కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత మహా అయితే మూడు నాలుగు సార్లు డిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులని కలిసి ఉంటారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే తనకు అసలు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, మద్దతు అవసరమే లేదన్నట్లుందని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కారణంగా అంతిమంగా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే నష్టపోవలసి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

కామెడీ ఈజ్ కింగ్‌

సర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అన్న‌ట్టు.. జోన‌ర్ల‌న్నింటిలోనూ హాస్యం ప్ర‌ధానం అని న‌మ్ముతుంది చిత్ర‌సీమ‌. ప‌క్కాగా నవ్వించాలే కానీ, సినిమా హిట్ట‌వ్వ‌డం గ్యారెంటీ. ఇలాంటి సినిమాల‌కు జ‌నాల్లో రీచ్ కూడా ఎక్కువ‌. ఫ్యామిలీ మొత్తం...

కేసీఆర్ ఆలస్యం చేస్తే జరిగేది ఇదే!

నడిపించే నాయకుడు సైలెంట్ గా ఉండిపోతే ఏం జరుగుతుందన్నది బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. నేతలకు దిశానిర్దేశం చేసే అధినేత ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ క్రమంగా పట్టు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close