కాంగ్రెస్ ఇవ్వబోయే దళిత బంధులో రూ. 12 లక్షలు !

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించింది. చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వచ్చారు. ఆయన సమక్షంలో రేవంత్ రెడ్డి.. ఎస్సీ, ఎస్టీలకు గుక్కతిప్పుకోలేనన్ని హామీలు ప్రకటించారు. దళిత బంధు పేరు మార్చేసి… అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని ప్రకటించారు. టెన్త్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.10 వేలు , ఇంటర్ పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ. 15 వేలు , డిగ్రీ పాసైన దళిత, గిరిజన విద్యార్ధులకు రూ.25 వేలు, పీజీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్ల కింద ఆరు లక్షలు ఇస్తామన్నారు.

ఇక రిజర్వేషన్ల విషయంలోనూ ఉదారత చూపించారు. పద్దెనిమిది శాతం ఎస్సీ, పన్నెండు శాతం ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు. పోడు భూములపై ఎస్టీలకు పూర్తి హక్కులు ఇవ్వడంతో పాటు ఎస్టీ కార్పొరషన్ ను ఏర్పాటు చేసి యువతకు పాతిక లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ అటవీ ప్రాంతాల్లో ఉండే ఐటీడీఏలను మైదాన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. విదేశీ విద్యకు వెళ్లేవారికి అవసరమైనసాయం చేస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్ ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేసే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీదని అధ్యక్షుడు ఖర్గే భరోసా ఇచ్చారు. ఎస్సీ ,ఎస్టీలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ వారికి పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశ పెట్టారని అంటున్నారు. అయితే వాటిని మించి పథకాలు ప్రకటించారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను దళితులు, గిరిజనులు ఎంత ఎక్కువ నమ్మితే అంతగా ఓట్ల వెల్లువ వ్సతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close