తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ఆర్థిక మోడల్స్‌గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. CURE కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ , PURE పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ , RARE రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకుది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ఈ పాలసీని అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
క్యూర్ పాలసీలో కోర్ సిటీని అంటే ఓఆర్ఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్‌ను ‘క్యూర్’ చేస్తూ గ్లోబల్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య బెల్ట్‌ను ప్యూర్ అని పిలుస్తున్నారు. రాష్ట్రాన్ని వేగంగా అనుసంధానం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెల్ట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్-అదిలాబాద్-భద్రాద్రి కొత్తగూడెం-రామగుండం విమానాశ్రయాలు, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
ORR లోపలి ప్రాంతాన్ని (CURE) కాలుష్య రహితంగా, ప్రపంచ స్థాయి గ్రీన్ సిటీగా మారుస్తారు. ORR-RRR మధ్య బెల్ట్‌ను (PURE) ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ రింగ్‌గా తీర్చిదిద్దుతారు. ఇక్కడే మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎయిర్‌పోర్టులు వస్తాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడికైనా 4 గంటల్లో చేరవచ్చని ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రణాళిక.. ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది.